పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలే వీళ్ళను ఎన్నుకొన్నారు. రెండవరకంవాళ్ళు రాజులచే అధికారపూర్వకంగా నియమింపబడినవాళ్లు.

న్యాయాధిపతుల బాధ్యతలు ఇవి. మీరు "న్యాయం చెప్పేప్పడు అన్యాయం చేయకూడదు. తీర్పు చెప్పేప్పడు పేదవాళ్ళకోపు తీసికోనూరాదు, ధనవంతులకు భయపడనూరాదు. ధర్మబుద్ధితో తోడివాడికి తీర్పు చెప్పాలి - లేవీ 19,15. అధిక సంఖ్యాకుల అభిప్రాయంతో ఏకీభవించి న్యాయానికి భంగం కలిగించకూడదు - నిర్గ 23.2. న్యాయకర్తలు పేదవాణ్ణి మోసగించి తీర్పు చెప్పకూడదు. - 23,6.

ఇన్ని శాసనాలున్నా కొందరు న్యాయమూర్తులు ధర్మసమ్మతంగా తీర్పు చెప్పేవాళ్లుకాదు. కనుకనే కీర్తనకారుడు వాళ్ళను ఈలా హెచ్చరించాడు:

"మీ అన్యాయపు తీర్పులు ఇక చాలు
దుర్మార్గులకు అనుకూలంగా తీర్పు చెప్పకండి
పేదలకు అనాథులకు న్యాయం జరిగించండి
దీనులకూ బికారులకూ న్యాయం చేకూర్చండి
దుషులనుండి వారిని విడిపించండి" - కీర్త 82:2 -4.

కొందరు న్యాయాధిపతులు లంచాలు తీసికొని న్యాయం చెరిచేవాళు. ఈలాంటివాళ్ళను ఆమోసు ప్రవక్త నిశితంగా విమర్శించాడు :

"అన్యాయపు న్యాయమూర్తులు లంచంగా పుచ్చుకొని
మంచివాళ్లను అమ్మివేస్తున్నారు
ఒక జోడు చెప్పలు లంచంగా పుచ్చుకొని
పేదవాణ్ణి అమ్మివేస్తున్నారు" - 2,6.

నగరద్వారంవద్ద అన్యాయమైన తీర్పుచెప్పే పెద్దలను న్యాయస్థానాలు ఏవగించుకొంటున్నాయి - 5,10. ఈలాంటి పరిస్థితుల్లో మంచివాళ్లు తమ తగాదాలను అసలు న్యాయస్థానాలకు తీసికొనిరావడమే లేదు. - 5:13. కనుకనే ప్రవక్త న్యాయాధిపతులను ఈలా హెచ్చరించాడు:

"మీరు చెడ్డను విడనాడి మంచిని చేపట్టండి
ఆలా చేస్తే బ్రతికిపోతారు
సర్వశక్తిమంతుడైన ప్రభువుకూడ
మీకు తోడ్పడతాడు
మీరు న్యాయస్థానాల్లో ధర్మం జరిగించండి