పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ధనవంతులు

న్యాయాధిపతులూ రాజులకంటెగూడ ధనవంతులను అధికంగా చీవాట్లపెట్టారు ప్రవక్తలు. యిప్రాయేలు సమాజంలో క్రమేణ ధనవంతులు పేదలు అనే రెండుశాఖలవాళ్లు ఏర్పడ్డారు. ఓ వైపు పేదలు మలమలమాడి చస్తూంటే మరోవైపు ధనవంతులు సుఖభోగాలతో హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆకాలంలో ధనవంతులకు వేసవికాలపు గృహాలూ శీతాకాలపు గృహాలూ వేరువేరుగా వుండేవి. కనుకనే ఆమోసు ప్రవక్త ఈలా అన్నాడు:

"మీ శీతాకాలపు గృహాలనూ వేసవికాలపు ఇండ్లనూ
దంతంతో అలంకరించిన నివాసాలనూ
నేను కూల్చివేస్తాను" - 3,15.

ఈ ధనవంతులుచేసే అన్యాయాలను యెషయా పేర్కొన్నాడు :
"ఇంటికియిలల్లా చేనికిచేనూ చేర్చి
అంతా తామే ఆక్రమించుకొంటున్నారు
దేశమంతా తమ స్వాధీనం చేసికొంటున్నారు" - 5,8.

ఈ ధనవంతులు చేసే దోపిడిని మీకా ఈలా వర్ణించాడు :
"దుషులు హాయిగా పడకలమీద పండుకొని
దుర్మార్గపు పన్నాగాలు పన్నుతూన్నారు
తెల్లవారగానే ఆ పన్నుగడలు సాధిస్తారు
వాళ్ళకు బలమందిగదా!
ఇతరుల పొలాలు కావలసివస్తే
వాటిని ఆక్రమించుకొంటారు
ఇండ్లు కావలసివస్తే వాటినీ కాజేస్తారు
ఆ యిండ్లతోబాటు వాటిల్లోని
కుటుంబాలనుగూడ స్వాధీనం చేసికొంటారు" - 2, 1-2.

ఆమేసు ప్రవక్త ఈ ధనవంతుల సుఖజీవనాన్ని తీక్షణంగా ఖండించాడు:
దంతపు మంచాలమీద పండుకొని
మెత్తని పాన్పులమీద దొర్లుతూ
మంచి గొర్రెపిల్లలను క్రొవ్విన దూడలనూ భూజించే
దనవంతులకు దుర్గతి తప్పదు
మీరు దావీదులాగ పాటలుకట్టి
వీణలమీద పాడుతూన్నారు