పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు "నేను ఓ సేవకుళ్లాగ మీ మధ్యలో వున్నాను" అంటాడు - లూకా 22,27. "మనుష్య కుమారుడు సేవలు చేయించుకోవడానికి గాదు, సేవలు చేయడానికి వచ్చాడు" అని పల్కాడు - మార్కు 10,45. కనుక సేవ చేయడమనేది క్రైస్తవ నాయకత్వానికి ప్రధాన లక్షణం. క్రీస్తు తన శిష్యులకు బోధిసూ అన్యజాతి ప్రజల్లో కన్పించే నాయకత్వాన్ని వరిశీలించమన్నాడు. వాళ్ళల్లో పైఅధికారి తన క్రింది అధికారి మీద పెత్తనం చెలాయిస్తూంటాడు. కాని ఇది నాయకత్వం గాదు, ప్రభుత్వం. ప్రభువు శిష్యులతో "మీరీలా ప్రవర్తించగూడద"ని నొక్కిచెప్పాడు. శిష్యుల్లో నాయకుడు కాదలచుకొన్నవాడు, ఇతరులకు సేవచేయాలి. మొదటివాడు కాదలచుకొన్నవాడు కడపటివాడు కావాలి - మార్కు-9,35. ఈ బోధలను జీర్ణం చేసికొన్న పేత్రు తర్వాత తన క్రింది అధికారులకు వ్రాస్తూ "మీరు అధికారుల్లాగ దైవ ప్రజల మీద పెత్తనం చెలాయించవద్దు. చక్కని ఆదర్శంతో వాళ్ళకు సన్మాతృక నీయండి" అని వ్రాసాడు - 1 పే 5,3.

ప్రభువు శిష్యుల పాదాలు కడిగి "నేను మీకు ఓ మాతృకను జూపాను, మీరూ నాలాగే ప్రవర్తించండి" అని పల్కాడు - యోహా 13,15. కనుక నాయకత్వమంటే వినయంతో తోడి ప్రజలకు సేవలు చేయడమే. ఈ భావాన్ని భాగా అర్థం జేసికొంటే నాయకత్వానికి అంతగా అర్రులు చాచం, అధికారాలను పొందడానికీ, పెద్ద పదవులను సంపాదించడానికి అంతగా ఉబలాటపడం. పెద్దలే స్వయంగా ఆ పదవులనూ ఆధికారాలనూ మన భుజాల మీద పెట్టినపుడు "నాకు రాత్రిలో గూడ గొడుగు పట్టండి" అన్నట్లుగా ప్రవర్తించం. అందుచేత క్రైస్తవ నాయకత్వమనేది స్వార్థం కొరకు గాదు, పరసేవ కొరకని గ్రహిద్దాం.

3. ధనవాంఛ

ధనవాంఛవల్ల క్రైస్తవ నాయకులు చాలామంది చెడిపోయారు, చెడిపోతున్నారు గూడ. పౌలు తాను నియమించిన తిమోతి, తీతు మొదలైన నాయకులను ధనవాంఛను గూర్చి పదేపదే హెచ్చరించాడు. డబ్బు చేసికోవాలనుకొనేవాడు నాయకత్వానికి తగడని చెప్పాడు - 1 తిమొు 3, 3; 3,8. తీతు 1,7. పైగా 1 తిమొు 6,10లో "ధనవాంఛ సకల అనర్గాలకు మూలం" అని చెప్పాడు. డబ్బు చేసికోగోరే నాయకులు ప్రజలకు సేవ చేయలేరు. ధనపిశాచం సోకినవాళ్లు ప్రజలకు చెల్లవలసింది గూడ తామే కొట్టేస్తూంటారు. ధన మొక యజమానుడు, భగవంతుడు వేరొక యజమానుడు. ఈ యిద్దరికీ ఒకే మారు సేవ చేయలేం - మత్త 6,24. ధనవాంఛ నాయకులను పట్టి పీడించే ప్రధాన శోధనల్లో ఒకటిగా భావించాలి.

4. మురాతత్వం

కొంతమంది నాయకులు సులభంగా మరాల్లో చేరిపోతూంటారు. లేదా స్వయంగా ఓ క్రొత్త ముఠాను లేవదీస్తూంటారు. మన దేశంలో ఈ మురాలు తరచుగా