పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కులాన్ని బట్టి పడుతూంటాయి. ఓ కులానికో వర్గానికో చెందినవాళ్ళంతా ఓ ముఠాగా ఒనగూడుతారు. నాయకుడు ఈ మరాతో ఐక్యమై తన బలాన్ని అధికంజేసికొంటాడు. తన ముఠాకు చెందనివాళ్ళను అనాదరం చేస్తాడు, చేయగూడని దారుణ కార్యాలు చేస్తాడు. దైవబలాన్ని విస్మరించి మానుష బలంమీద ఆధారపడడమంటే యిదే. ఈలాంటివాళ్ళను గూర్చి యిర్మీయా "దేవుని మీద ఆధారపడేవాడు ధన్యుడు. కాని నరుని మీద ఆధారపడేవాడు శాపం పాలౌతాడు” అని వాకొన్నాడు - 17, 6-7.

పూర్వం కొరింతు ప్రజల్లో ఈలాంటి మఠాలు ఏర్పడ్డాయి. వాళ్లు కులాన్ని బట్టిగాదుగాని, తమకు బోధించిన బోధకులను బట్టి కొన్ని ముఠాలుగా చీలిపోయారు. కొందరు మాది పౌలు ముఠా అన్నారు. మరి కొందరు మాది పేత్రు ముఠా అన్నారు. ఇంకా కొందరు మాది అపొల్లో ముఠా అన్నారు. ఈ సంగతి విని పౌలు వాళ్ళను కఠినంగా మందలించాడు. క్రైస్తవుల కందరికీ ఒకే నాయకుడు క్రీస్తు, క్రైస్తవులందరూ ఒకే సమాజం తిరుసభ అని బోధించాడు - 1 కొ 1, 10-13.

క్రైస్తవ నాయకులు ఈ ముఠా తత్వాన్నుండి జాగ్రత్తగా వైదొలగుతూండాలి. దురదృష్టవశాత్తు ధనవాంఛా మురాతత్వమూ నేడు మన నాయకుల్లో ప్రచురంగా కన్పిస్తున్నాయి. ఈనాడు చాల క్రైస్తవ సమాజాలు క్షయ రోగిలాగ నవిసిపోతున్నాయంటే, ఈ దుర్గుణాలే కారణం.

7. నాయకుని సిలువలు

క్త్రెస్తవ నాయకుడు కొన్ని సిలువలను మోయడానికి సంసిద్ధుడు కావాలి. అప్పుడు గాని అతని నాయకత్వం ఫలవంతం గాదు. ఈ సిలువలు ముఖ్యంగా మూడు - శిక్షణం, బాధలు, బలహీనత, వీటిని గూర్చి క్రమంగా విచారిద్దాం.

1. శిక్షణం

సామెతల గ్రంథం "కుమారా! ప్రభు విచ్చే శిక్షణను అనాదరం చేయబోకు. ప్రభువు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళను శిక్షిస్తాడు" అంటుంది - 3, 11-12. కాని ప్రభువు ఈలా శిక్షించడం దేనికి? నరులు ఆత్మనిగ్రహం అలవర్చుకోవడానికి. "ఎవడైనా నన్నను సరింపగోరితే తన్ను తాను నిగ్రహించుకొంటూ రోజురోజు నా సిలువను మోసికొంటూ నా వెంట రావాలి" అన్న ప్రభువాక్యం మనకు తెలుసు - లూకా 9,23. కనుక శిక్షణం ఆత్మనిగ్రహం కొరకు. ఈ నిగ్రహం ద్వారా మనలో దివ్యజీవం నెలకొంటుంది. నాయకులు మానుషత్వాన్ని దాటి దివ్యత్వాన్ని చేకొనాలంటే, శీలవంతులూ భగవత్సేవకులూ కావాలంటే ఈ శిక్షణను పొందాలి. ఈ శిక్షణను మనకు ఎవరో వచ్చి యిచ్చిపోరు. మనలను మనమే శిక్షించుకోవాలి. ప్రభు వరప్రసాద సహాయంతో మనలోని ఆశాపాశాలనూ వ్యామోహాలనూ