పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకుడు ప్రజల గుర్తింపుకోసం ప్రాకులాడకూడదు. నాయకుల కందరికంటె గొప్ప నాయకుడు క్రీస్తు. ఐనా అతడు ఎవరి గుర్తింపూ కోరుకోలేదు. నజరేతు లాంటి కుగ్రామం తనకు తగదనీ భావించలేదు. అతనిలాగ నడికట్టు కట్టుకొని వినయంతో తోడి ప్రజల పాదాలు కడగడానికి వంగేవాడే ఉత్తమ నాయకుడు.

ఈ క్రీస్తు వినయవంతుడు. అతడు సింహాసనంపై కూర్చుండి వుండే గొర్రెపిల్ల. సింహాసనం గౌరవప్రదమైన తావు. గొర్రెపిల్ల వినయానికి ప్రసిద్ధి. గౌరవప్రదమైన తావులో వున్నా క్రీస్తు వినయంగా వుండేవాడు. ఈ వినయమే క్రైస్తవ నాయకులకు గూడ వుండాలి. వినయవంతులైన నాయకులు ఇతరుల విమర్శలను సహిస్తారు. ఇతరులు చేసే సూచనలను ఆదరిస్తారు. తాము అధికారాన్ని నెరపుతూన్నా నెమ్మదిగా ప్రవర్తిస్తారు. తమ అనుచరుల మీద అధికారం చెలాయించరుగదా, వాళ్ళనూ ఓ పాటివాళ్ళనుగా తయారు చేస్తారు. మోషే అనుచరుడు యోషువా, ఐనా మోషే యోషువా వ్యక్తిత్వాన్ని నాశం చేయలేదు, అతన్నీ ఓ నాయకునిగా తీర్చిదిద్దాడు. బైబులు ఈ మోషే మహా వినయవంతుడని చెప్పంది.

వినయవంతులైన వాళ్లు నిరుత్సాహానికీ విచారానికీ అట్టే తావీయరు. క్రైస్తవ నాయకులు తరచుగా నిరుత్సాహ పడుతూండడం గమనిస్తూంటాం. ఈ ప్రజలకు ఎంత మేలుచేస్తే మాత్రం ఏమి లాభం అనే భావం నాయకుల కందరికీ కలుగుతూనే వుంటుంది. కాని ఈ నిరుత్సాహ భావాన్ని జయించాలి. మన మెంత గొప్ప నాయకులమైనా అందరూ మన మాట వినరు, అన్నీ సాధించలేం. మోషే అంతటివాడిమీద కోరా తిరుగబడ్డాడు - సంఖ్యా 16,1. మోషే అక్కా అన్నాఅయిన మిర్యాము అహరోను అతనిమీద సణుగుకొన్నారు - సంఖ్యా 12,1. మనకు ఎప్పుడూ విజయమే లభిస్తుంది అనుకొంటే మానవ స్వభావం అర్థంచేసికోనివాళ్ళమే ఔతాం. అసలు మొదట నిరాకృతి చెందిన నరునికేగాని తరువాత అంగీకృతి అనేది లభింపదు. కనుక వినయవంతుడు నిరుత్సాహానికి లొంగకూడదు.

నిరుత్సాహానికంటె గూడ పెద్ద దుర్గుణం విచారం. కొందరు నాయకులు తాము సాధింప గోరిన కార్యాన్ని సాధించలేనపుడు విచార హృదయ లౌతూంటారు. ఇక వాళ్ళ ముఖంలో ఉత్సాహంగాని తేజస్సు గాని కనిపించదు. ఇది వాళ్ళ స్వార్థపరత్వానికే నిదర్శనమనాలి. ఏదో కార్యం నెరవేరకపోవడంగాక, తాము కోరుకొన్నట్లుగా ఆ కార్యం నెరవేరక పోవడం ఈ విచారానికి కారణం. నాయకులు ఈ విచార మనస్కతను జయించాలి.

3. ప్రేమభావం

ఆత్మపూరుడైన నరుడు తోడి నరులను ప్రేమభావంతో ఆదరిస్తూంటాడు. కాపరి గొర్రెల మందను గూర్చివలె అతడూ ప్రజలను గూర్చి జాగ్రత్త పడుతూంటాడు. గొర్రెల మందల్లాగ దిక్మూమొక్కూ లేక చెల్లాచెదరై యున్నప్రజా సమూహాలను జూచి క్రీస్తు జాలి