పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టణానికి వెళ్లాడు - లూకా 9,51. ఇవన్నీ క్రైస్తవ నాయకుడు ప్రదర్శింప వలసిన ధైర్య గుణానికి నిదర్శనలు.

       నాయకునికి ఈ ధైర్యంతో పాటు పట్టుదల కూడ అవసరం. మన మనుకొన్నంత సులభంగా పనులు జరుగవు. నరులు కూడ మనమనుకొన్నంత సులభంగా సత్కార్యాలు చేయరు. ఈలాంటప్పడు మనం పట్టుదలతో కృషి చేస్తూండాలి. క్రీస్తు ఒకటి చెపూంటే శిష్యులు మరొకటి అర్థంచేసికొనేవాళ్లు, ప్రభువు ఎంత బోధించినా వాళ్ళ దృష్టి భౌతిక వస్తువులనుండి ఆధ్యాత్మిక వస్తువులవైపు మరిలేదే కాదు. ఐనా అతడు నిరుత్సాహపడకుండా పట్టుదలతో బోధిస్తూ వచ్చాడు. కడకు వాళ్ళను మార్చి ఆధ్యాత్మిక నరులనుగా తయారు చేసాడు.
  మోషే గతించాక యోషువా ప్రజలకు నాయకుడయ్యాడు. ఆతడు నాయకత్వం వహించేప్పడు ప్రభువు "శక్తితోను ధైర్యంతోను పనిచేయి, అన్నీ చక్కబడతాయి" అన్నాడు - యోషు 1,7. యోషువా శక్తితోను ధైర్యంతోను పని చేసాడు. ప్రజలను వాగ్రత్త భూమికి చేర్చాడు. నాయకత్వం వహించేవాళ్ళు చూపవలసిన ధైర్యం ఆయా పరిస్థితులనుబట్టి భిన్నభిన్నంగా వుంటుంది. నాయకులకు ఈ ధైర్యాన్ని ప్రసాదించేది పరిశుద్దాత్మ - మార్కు 13,11.

3. నమ్మిక

నాయకుని కుండవలసిన మరోగుణం, దేవునియందు తీరని నమ్మకం. "మీ హృదయాలను కలత జెందనీయకండి, నేను లోకాన్ని జయించాను" అన్నాడు ప్రభువు - యోహా 16,33. మనం ఈ ప్రభువును నమ్ముతూండాలి. అతని విజయం మన విజయం. ప్రభువుకి అపజయమంటూ లేదు. అతనిని నమ్మిన శిష్యులకు గూడ పరాజయమంటూ లేదు. శిష్యులు అతనియందు జీవించేవాళ్లు, అతని బలాన్ని పొందేవాళ్లు, అందుకే "నేను జీవిస్తున్నాను గనుక మీరూ జీవిస్తారు" అన్నాడు ప్రభువు - యోహా 14,19,

3. ఆత్మపూర్ణత

Sść నాయకుని కుండవలసిన మూడవ గుణం ఆత్మపూర్ణత. అంటే పరిశుద్ధాత్మతో నిండివుండడం. ఇక్కడ ఆత్మపూరులైన వాళ్ళల్లో కనిపించే లక్షణాలను రెండింటిని పరిశీలిద్దాం. అవి వినయమూ, ప్రేమా.

1.వినయం

మామూలుగా మనం అందరికంటె గొప్పవాళ్ళంగా గణింపబడాలని కోరుకొంటూంటాం. క్రీస్తు శిష్యులు గూడ ఓమారు ఈ దురుణాన్ని ప్రదర్శించారు. అప్పడు ప్రభువు వాళ్ళను నిశితంగా మందలించాడు - మార్కు 9,33-37. క్రైస్తవ