పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ క్రీస్తు జవాబును ఆలించిన ధర్మశాస్త్ర బోధకుడు మరో సత్యం చెప్పాడు. దేవునీని కూడ ప్రేమించడమనేది బలులూ దహనబలులూ అర్పించడం కంటె గూడ గొప్పది. ఎందుకు? బల్యర్పణం కేవలం కర్మకాండ కావచ్చు. హృదయంలో భక్తిలేకుండానే బయటకి కానుకలు అర్పించవచ్చు. అలాంటి బల్యర్పణానికి విలువలేదు. కాని ప్రేమ అనేది హృదయంలో నుండి పట్టకవస్తుంది. మనసులో లేని ప్రేమను బయటికి చూపలేంగదా? కనుక బలి చిత్తశుద్ధి లేనిదైతే ప్రేమ చిత్తశుద్ధి కలది.

ధర్మశాస్త్ర బోధకుని మాటలను మెచ్చుకొని ప్రభువు అతనితో "నీవు చక్కగా సమాధానమిచ్చావు. నీలాంటివాడు దైవరాజ్యానికి చేరువలోనే వుంటాడు" అని పల్మాడు - 12,34 ఆ శాస్త్రి భావాలూ విలువలూ మనకూ వుంటే మనంకూడ అతనిలాగే దైవరాజ్యానికి దగ్గరగా వుంటాం.

4. తండ్రిలాగే కరుణాపూరితులం కావాలి — లూకా 6,36

మత్త 5,48 మనం తండ్రిలాగే పరిపూరులమై యుండాలని చెప్తుంది. దీనికి తుల్యమైన వాక్యం లూకా సువార్తలో 6,36. కాని ఈ వాక్యంలో మనం తండ్రిలాగే కరుణాపూరితులం కావాలని చెప్పాడు లూకా, మత్తయి పేర్కొన్న పరిపూర్ణగుణమూ, లూకా పేర్కొన్న కరుణాగుణమూ ఒకటే, మనం తండ్రిలాగ పరిపూరులం కావలసింది ఏయంశంలో? తెలివితేటల్లో కాదు. శక్తిసామర్థ్యాల్లో కాదు. మరి కరుణాగణంలో, ఆ దేవునిలాగ కనికరం జూపితే మనంగూడ అతని లాగే పరిపూరులమౌతాం.

భగవంతుని కల్యాణగుణాలు చాలా వున్నాయి. వాటన్నిటిలోను అతని కనికరం గొప్పది. కనుకనే అతడు హోషేయ ప్రవక్తముఖాన "నేను కోరేది కనికరం గాని బలులు కాదు" అని పల్మాడు - 6,6. నూత్నవేదంలో క్రీస్తుకూడ ఈ వాక్యాన్ని ఉదాహరించాడు - మత్త 9,13. క్రీస్తు తన తరపునతాను "నేను వచ్చింది వ్యాధిగ్రస్తుల కోసంగాని ఆరోగ్యవంతుల కోసం గాదు" అని పల్మాడు. అనగా అతడు పాపులపట్ల కనికరం చూపడానికి విచ్చేసాడు - లూకా 5,31-32. భగవంతుని జాలి ఈలాంటిది.

నిత్యజీవితంలో మనం ఈ జాలినీ కరుణనీ మరచిపోతాం. మొత్తగా వుంటే జనం మన తలమిూదికెక్కి కూర్చుంటారు అనుకొని వాళ్ళపట్ల కటువుగా ప్రవర్తిస్తాం. కాని నెనరు అనేది ప్రేమలో ఓ ముఖ్యభాగం. అదిలేందే సోదర ప్రేమ లేదు. కనుక ఆ తండ్రీకొడుకుల్లాగే మనంకూడ తోడిజనం పట్ల కారుణ్యం చూపడం నేర్చుకోవాలి.

5. ఒక చెంపన గొడితే మరో చెంప - లూకా 6.27-31

ప్రభువు ఆజ్ఞల్లో కొన్నిపాటించడానికి కష్టమైనవి. అలాంటివాటిల్లో ఈ యాజ్ఞ కూడ ఒకటి. ఇతరుడు మనలను ఒక చెంపన గొడితే మనం మరో చెంపను