పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మామూలుగా మనం దైవప్రేమకు ఇచ్చినంత గౌరవం సోదరప్రేమకు ఈయం, కాని క్రీస్తు పలుకుల ప్రకారం ఈ రెండవది కూడ మొదటిదానంత విలువైంది - మత్త22,39. మోషే ధర్మశాస్త్రమంతటిలోను ఈ రెండాజ్ఞలు ప్రధానమైనవి.

ఈ రెండిటిల్లోను చెప్పబడిన ప్రేమ ఒక్కటే. మనం అదే ప్రేమతో భగవంతుణ్ణి తోడినరుజ్జీ కూడ ప్రేమిస్తాం. ఒకే నది రెండు పాయలుగా చీలిపోతుంది. ఒకే చెట్టు రెండు కొమ్మలుగా చీలిపోతుంది. అలాగే ఒకేప్రేమ దైవ సోదర ప్రేమలుగా విభక్తమౌతుంది.
ఈ ప్రేమాజ్ఞ చాల విలువైంది. ఒంకెమిూది నుండి బట్టలు వ్రేలాడుతుంటాయి. అలాగే మోషే జారీ చేసిన ఆజ్ఞలన్నీ ఈ ప్రేమాజ్ఞ విూది నుండి వ్రేలాడుతుంటాయి. అన్నిటికి ఆధారం అదే ఇంకా ప్రవక్తలు చెప్పిన సందేశాలకు కూడ ఈ ప్రేమాట్టే మూలం. అనగా పూర్వ వేదమంతటికీ ఈ ప్రేమే పునాది అని అర్థం. ఇక, నూత్నవేదానికి ఈ ప్రేమ గుండెకాయలాంటిదని వేరుగా చెప్పాలా?
మనం దైవప్రేమను ఘనంగానే యెంచుతాంగాని సోదరప్రేమను చులకన చేస్తామని ముందే చెప్పాం. ఇది పెద్దపొరపాటు, సోదరప్రేమగూడ దైవప్రేమంత విలువైంది, దాని లాంటిది. అదిలేందే మన మతాచరణానికి అర్థంలేదు. మన నైతిక కార్యాలకు విలువలేదు. కనుక క్రైస్తవభక్తుడు తన సోదరప్రేమను జాగ్రత్తగా పరీక్షించి చూచుకోవాలి.

3. బలుల కంటె దహనబలులకంటె ఘనమైంది ప్రేమ - మార్కు 12,28-34

క్రీస్తు ప్రేమాజ్ఞను ఉదాహరించిన ఘట్టాన్ని మత్తయి లాగే మార్కు కూడ పేర్కొన్నాడు. ఈ సందర్భంలో మత్తయి చెప్పని అంశాలు ఒకటి రెండు మార్కుచెప్పాడు. యావే ఏకైక ప్రభువు. అతనిలాంటివాడు అతడొక్కడే ఇతర దేవతలకీ అతనికీ సామ్యం లేదు. యిప్రాయేలును ఎన్నుకొని ఓ జాతినిగా తీర్చిదిద్దింది అతడే. కనుక యిప్రాయేలు అతన్ని పూర్ణంగా ప్రేమించాలి. ఇక యూదులు ఆ ప్రభువుని లాగే తోడిజనాన్ని గూడ ప్రేమించాలి.

ప్రేమాజ్ఞలో రెండు భాగాలున్నాయని చెప్పాం గదా! సోదరప్రేమకూ దైవప్రేమకూ సమానమైన విలువుందని చెప్పినవాళ్ళల్లో క్రీస్తే మొదటివాడు కాదు. అతనికి ముందు కొందరు రబ్బయిలు కూడ ఈ బోధ చేసారు. హిలెల్ అనే రబ్బయి "పరిశుద్దుడయిన దేవుడు పేదలకు బట్టలిస్తాడు, బాధితులను ఓదారుస్తాడు, మృతులను పాతిపెడతాడు. అలాగే మనంకూడ పేదలకు దుస్తలీయాలి, రోగులను పరామర్శించాలి, మృతులను ” అని నుడివాడు. కాని ఏ రబ్బయి కూడ క్రీస్తులాగ ఈ రెండాజ్ఞల సమానత్వాన్ని నొక్కిచెప్పలేదు.