పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపించవలసిందే గాని వాని విూద పగ తీర్చుకోగూడదు. అలాగే అతడు మన వెలుపలి బట్టను లాగుకొంటే లోపలి బట్టను గూడ తీసికోనీయవలసిందే గాని వానిని శిక్షింపకూడదు. అనగా శత్రువులు హింసిస్తున్నపుడు కూడ మనం ఎంతో ఓర్పూ తాల్మీ ప్రదర్శించాలని భావం.

మనం నిత్యజీవితంలో ఈలా ప్రవర్తిస్తే దుర్మార్గుల దౌర్జన్యం ఇంకా పెరిగిపోవచ్చు అందువల్ల మన తరపున మనం జాగ్రత్తగాను కరకుగాను ఉండగోరుతాం. దౌర్జన్యాన్ని తప్పకుండా ఎదిరించవలసిందే. కాని కరకుగా వుండడమంటే ఓర్పూ తాల్మీ వద్దని S"čốo. సోదరప్రేమలో ఓర్పుగూడ ఓ భాగం. దాన్ని పాటించడం చాల కష్టం. ఐనా ఓర్పు కలవాడే సోదరప్రేమ కల నరుడు. విశేషంగా శత్రువమిూద పగతీర్చుకోవడం పనికిరాదు. చెడ్డను చెడ్డతో గాక, మంచితో వారించాలి - రోమా 12,21.

6. ఇతరులను తీర్మానించరాదు = లూకా 6.37-38

ఇతరుల యెడల కరుణ చూపాలని చెప్పాం. ఆ కరుణలో ఒక భాగమే ఇతరులను ఖండించకుండా వుండడం. మామూలుగా మనం పరులను అతిసులభంగా విమర్శిస్తాం, వాళ్ళను గూర్చి చెడ్డగా తలుస్తాం, చెడ్డగా మాట్లాడతాం కూడ. ఇది పద్ధతి కాదు.

యూదనాయకులైన పరిసయుల్లో ఈ దురుణం బాగా వుండేది. వాళ్ళు తామే మంచివాళ్ళ మనుకొనేవాళ్ళు ఇతరులు చెడ్డవాళ్ళనుకొని వాళ్ళను చిన్నచూపు చూచేవాళ్ళు - లూకా 18,9. వాళ్ళు తమ తప్పిదాలను గూర్చి ఆలోచించుకోకుండా వ్యభిచారిణి తప్పిదానికి ఆమోమిూద రాళ్ళ రువ్వబోయారు - యోహా8,4. ఇంకా క్రీస్తులోనూ అతని శిష్యుల్లోనూ తప్పలు పట్టబోయారు — లూకా 5,30. అసలు క్రీస్తులో ఏమి తప్ప దొరుకుతుందా అని అతన్ని పొంచి చూస్తుండేవాళ్ళ - మార్కు8,2. ఈలాంటి మనస్తత్వం మనకు తగదు. మనం ఏ కొలతన కొలుస్తామో దేవుడు కూడ అదే కొలతన కొలుస్తాడు. కనుక ఇతరులను తీర్మానించడానికి సిద్ధంగా వుండకూడదు.

6ఎ. వ్యర్థంగా పలికే ప్రతిమాటకీ - మత్త 12,36

నరులు వ్యర్థంగా పలికే ప్రతిమాటకీ న్యాయనిర్ణయ దినాన లెక్క ఒప్పజెప్పాలి అన్నాడు ప్రభువు. మనం ఎన్నోసారులు అనవసరంగా, అసభ్యంగా మాటాడుతూంటాం. ఈ మాటల్లో ఎన్ని సోదరప్రేమకు వ్యతిరేకంగా వుంటాయో! ఈ సందర్భంలో యాకోబుజాబు నాలుకను గూర్చి చెప్పే వాక్యాలను గూడ గుర్తుకు తెచ్చుకోవాలి - 3,2-12. నాలుక రవ్వలాగ చిన్న అవయవం. కాని పెద్దచిచ్చు