పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక నూత్నవేదంలో క్రీస్తే మన మన్నా తండ్రి మనకొరకు ఆకాశంనుండి కురిపించిన అద్భుతభోజనం అతడే. అందుకే క్రీస్తు “మీ పితరులు ఎడారిలో మన్నా భుజించికూడ మరణించారు. పరలోకంనుండి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ యాహారాన్ని భుజించేవాడు నిరంతరం జీవిస్తాడు. ఈ లోకంలోని జనులు జీవించడానికి నేనిచ్చేది నా శరీరమే" అని పల్కాడు - యోహా 6, 48-51. కనుక నేడు మనం ద్యీవసత్ప్రసాదం పుచ్చుకొన్నపుడు ఈ మన్నానే భుజిస్తాం. ఇంకా క్రీస్తు రొట్టెలను విస్తరింపజేసాడుగదా? ఆ యద్భుతంగూడ ఈ మన్నానే సూచిస్తుంది - యోహా 6,1-13.

2. రాతిబండనుండి నీళ్లు

ప్రజలు ఎడారిలో రెఫిదీముకడ విడిది చేసారు. అచ్చట వాళ్ళకు త్రాగడానికి నీళ్లు దొరకలేదు. ఇకనేం, ఆజనం మోషేమీద ఎగబడ్డారు. నీవు మమ్ము ఐగుప్తునుండి ఎందుకు తోడ్కొని వచ్చావని తిరగబడ్డారు. దేవుడు మనలను చేయి విడిచాడు. అతడే మనతోవుంటే ఈ యిబ్బందులన్నీ ఎందుకు వస్తాయని ఆపసోపాలు పడ్డారు. అప్పడు మోషే యావే సలహాపై కర్రతో దాపలోని రాతిచట్టును కొట్టాడు. ఆ బండనుండి అద్భుతంగా నీటిపాయ వెలువడింది. ప్రజలూ వారి పశువులూ ఆ నీళ్లు త్రాగి సంతృప్తిచెందారు. ఇక్కడ ప్రజలు యావే మనతో వున్నాడా లేదా అని సందేహించి అతన్ని పరీక్షకు గురిచేసారు. కావుననే ఆ తావుకి "మాసా" అని పేరు. హీబ్రూలో మాసా అంటే పరీక్ష అని అర్ధం - నిర్గ 17, 1-7.

ఇక, రాతిబండనుండి వెలువడిన నీళ్లు పవిత్రాత్మకు చిహ్నం. "మీ అపవిత్రత తొలగిపోయేలా నేను మీమీద నిర్మలమైన జలాలు చిలకరిస్తాను.” అంటాడు యెహెజ్నేలు ప్రవక్త - 36,24-27. ఈ జలాలే ఆత్మ నూత్నవేదంలో క్రీస్తుని నమ్మినవాళ్ళ అంతరంగంనుండి జీవజలాలు పుట్టుకవస్తాయి. ఈ జీవజలాలుకూడ ఆత్మే - యోహా 7, 37-38. మోషేకు రాతిబండ నుండి నీళ్లు లభించాయిగదా! రబ్బయుల సంప్రదాయం ప్రకారం ఈ రాయి ఎడారిఅంతటా యిప్రాయేలీయులతో ప్రయాణం చేసింది. ఈ రాయి ఎవరోకాదు క్రీస్తే అన్నాడు పౌలు - 1కొ 10,14. అనగా పూర్వవేదంనుండి క్రీస్తు యిస్రాయేలీయులతో సంచరిస్తూనే వున్నాడని భావం. ఈనాడు మనంకూడ ఆత్మను పొందేది ఈ క్రీస్తునుండే చనిపోయేపుడు అతని ప్రక్కను ఈటెతో పొడువగా నీళూ నెత్తురూ వెలువడ్డాయని వింటున్నాం. ఈ నీళ్ళు జ్ఞానస్నానాన్నీ పవిత్రాత్మనూ సూచిస్తాయి - యోహా 19, 34. ఇంకా యోహాను 19, 30 "క్రీస్తు ప్రాణం విడిచాడు అంటుంది. ఈ వాక్యంలోని "ప్రాణం" అనే మాటను గ్రీకు మూలంలో "ఆత్మ" అనికూడ అర్థం