పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ నెత్తురు ముఖ్యమైన వస్తువు. యూదుల భావం ప్రకారం నెత్తురులో జీవం వుంటుంది — లేవీ 17,14. ఆ నెత్తురు వల్ల భగవంతుడూ ప్రజలూ ఒక్కసమాజంగా ఐక్యమౌతారు. వారిలో ఒకే ప్రాణం నెలకొంటుంది. ఏలా? ఇక్కడ పీఠం దేవునికి గుర్తు. మోషే పీఠంమీద చల్లిన నెత్తురు దేవుడిచ్చే దివ్యజీవాన్ని సూచిస్తుంది. అతడు ప్రజలమీద చల్లిన నెతురు, ఆ దివ్యజీవంనుండే ప్రజలుకూడ తమ జీవాన్ని పొందుతారని తెలియజేస్తుంది. కనుక సీనాయి నిబంధనమంటే ప్రజలు దేవునినుండి తమ జీవాన్ని పొందడం, ఆ దేవుడూ ప్రజలూ కలసి ఒక్క సమాజంగా ఏర్పడి రక్తబంధువుల్లాగ జీవించడం.

8. నిబంధన భోజనం :

నిబంధనంలో ఇరుపక్షాలు భోజనం చేయడంగూడ ముఖ్యాంశం. అహరోను నాదాబు అబీహులతో, యిస్రాయేలు పెద్దలు డెబ్బది మందితో కొండమీది కెక్కిపోయాడు మోషే, అక్కడ ప్రభువు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాదాలక్రింద నీలమణి ఫలకం వెలుగుతూంది. పూర్వవేద సంప్రదాయం ప్రకారం నరుడు భగవంతుణ్ణి చూచి బ్రతకజాలడు — 33,20. కాని యిక్కడ ప్రభువు ఆ భక్తులకు ఏ హాని చేయలేదు. వాళ్లు యావేతోగాదు, యావే సమక్షంలో భోజనం చేసారు. కలసి భుజించేవాళు మిత్రులని హీబ్రూ ప్రజల భావం. ఈ నియమం ప్రకారం ఇక్కడ యావే యిస్రాయేలుకు మిత్రుడూ చుట్టమూ అయ్యాడు. ఈ కొండమీది భోజనం తర్వాత నూత్నవేదంలో వర్ణింపబడిన చాల భోజనాలకు ఆదర్శమయింది.

2. నిబంధనను మీరడం

పై రీతిగా ప్రభువు యిస్రాయేలీయులతో చేసికొన్న నిబంధనం ఎంతోకాలం నిలువలేదు. మోషే కొండమీదికివెళ్ళి చాలనాళ్లవరకు దిగిరాలేదు. అంతలోనే ప్రజలు ఆ మోషేకు ఏమి దుర్గతిపట్టిందోలె అనుకొని ఓ బంగారు దూడను తయారు చేసికొని దాన్ని ఆరాధించడం మొదలెట్టారు — 32, 4-6. ఇక్కడవాళ్ళు బంగారు దూడను పూజించడం దేనికి? ఆ కాలంలో యిప్రాయేలీయుల పొరుగుజాతియైన కనానీయులు బాలుదేవతను కొలిచేవాళ్లు, ఆ దేవతకు చిహ్నం ఎదు. కనుక వాళ్లు ఎద్దుకు మొక్కేవాళ్లు, అదిచూచి యిప్రాయేలీయులుకూడ వృషభ పూజకు పాల్పడ్డారు. దానినుండి అద్భుతశక్తులు పొందవచ్చు గదా అనుకొన్నారు. ఇది యావే ఏకైక దేవుడు అన్న తొలియాజ్ఞకు వ్యతిరేకమైన పాపం, సరే, కొండమీదవున్న మోషేకు ప్రభువు యిస్రాయేలీయులు భ్రష్టులైపోయారనీ విగ్రహారాధనకు ప్పాలడ్డారనీ తెలియజేసాడు. మోషే విచారంతో రాతిపలకలు తీసికొని