పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్వతం దిగివచ్చాడు. అతడు వచ్చేప్పటికల్లా యూదులు బంగారు దూడచుట్టు మూగి నాట్యం చేస్తూన్నారు. మోషే ఉగ్రుడైపోయి రాతిపలకలను అక్కడే విసరికొట్టాడు. అవి ముక్కముక్కలుగా పగిలిపోయాయి - 32.19. ఇక్కడ మోషే పలకలు పగులగొట్టడం ప్రభువు చేసిన నిబంధనం భగ్నమైపోయింది అనడానికి చిహ్నం. యిస్రాయేలీయులు ఎంత కృతఘ్నులో, ఎంత తలబిరుసు జనవెూ ఈ వొక్క సంపుటనం వల్లనే అర్థంచేసికోవచ్చు.

8. నిబంధనను నూత్నీకరించడం

కాని ప్రభువు దయామయుడు. సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యమూ ప్రేమ చూపేవాడు. నమ్మదగినవాడు — 34,6. కనుక అతడు మోషేను మళ్లా కొండమీదికి రమ్మన్నాడు. ఆ భక్తుడు మరిరెండు రాతిపలకలను చెక్కుకొని కొండ యొక్కాడు. అక్కడ దేవుడు అతణ్ణి కరుణించాడు. మరల ఆ పలకలమీద పదియాజ్ఞలు వ్రాసియిచ్చాడు. ప్రభువు యిస్రాయేలుతో మల్లా నిబంధనాన్ని నూతీకరించుకొన్నాడు - 34,27. యావే విశ్వసనీయుడు. అతడు ఆడితప్పడు. ప్రజలు దేవుని ఆజ్ఞను పాటించలేకపోయినా అతని నిబంధనమేమో నిలుస్తుంది. పాటించనివాళ్ళకు మాత్రం ఆ నిబంధనం ఫలితమీయదు, అంతే.

4. క్రీస్తు నిబంధనం

ప్రభువు మోషే ముఖాన సీనాయి కొండవద్ద యూదులతో నిబంధనం చేసికొన్నాడు అన్నాం. ఆలాగే అతడు నూత్నవేదంలో క్రీస్తుద్వారా మనతో నిబంధనం చేసికొన్నాడు. “ఇది యావే మీతో చేసికొనే నిబంధన రక్తం" అన్నాడు మోషే, నిర్గ 24,8. “ఇది అనేకులకొరకు చిందబడనున్న నా నూత్ననిబంధన రక్తం" అన్నాడు క్రీస్తు - మార్కు 14,26. ఈ పలుకులనుబట్టే ఈ రెండు నిబంధనల సామ్యాన్ని ఊహించవచ్చు. కాని అక్కడ పూర్వవేద నిబంధనంలో చిలకరించినది ఎడ్లనెత్తురు. ఇక్కడ నూతవేద నిబంధనంలో చిందించింది క్రీస్తు సొంత నెత్తురు. యిర్మీయా, యేహెజ్నేలు మొదలైన మహాప్రవక్తలంతా భవిష్యత్తులో రానున్న క్రొత్త నిబంధనను ప్రస్తావించారు. ఆ భక్తులు పేర్కొన్న నూత్న నిబంధనను నిర్వహించింది క్రీస్తే. పూర్వ నిబంధనంకంటె శ్రేష్టమైన నూత్ననిబంధనానికి క్రీస్తు మధ్యవర్తి అంటుంది హెబ్రేయుల జాబు - 8,6. అక్కడ ఆ జంతువుల నెత్తురే అంతటి పవిత్రకార్యం సాధిస్తే ఇక్కడ క్రీస్తు నెతురు ఇంకా యెంతటి పవిత్రకార్యం చేకూర్చి పెడుతుందో