పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లతో నిబంధనం చేసికొన్నాడు. ఇకమీదట వాళ్లు యావేను కొలవాలి. ఈలా హితీయుల ఒడంబడిక యూదుల ఒడంబడికకు ప్రాతిపదిక అయింది. ఏమైతేనేం, నిబంధనం బైబుల్లో ఓ పెద్ద భావం. ఈ యధ్యాయంలో ఒడంబడికనుగూర్చి కొన్ని వివరాలు తెలిసికొందాం.

1. నిబంధనం చేసికోవడం

1. సిద్ధం కావడం :

ప్రభువు తలపెట్టిన నిబంధనం ఓ వుపన్యాసంతో ప్రారంభమయింది. అతడు ఈలా చెప్పాడు. తాను యిస్రాయేలును ఐగుపునుండి తోడ్కొని వచ్చాడు. ఏలా? గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొని పోయినట్లే యూవే వారిని ఆప్యాయతతో మోసికొనివచ్చాడు - నిర్గ 19,4. కనుక ఆ ప్రజలు ప్రభువు మాట వినాలి. అతని నిబంధనను పాటించాలి. అప్పడు వాళ్లు అతని సొంతప్రజ, అనగా ప్రభువు ఎన్నుకొన్న ప్రజ ఔతారు. యాజకరూపమైన రాజ్యం ఔతారు. అంటే యావేను ఆరాధించే ప్రజ ఔతారు. పవిత్ర ప్రజ ఔతారు. ఎందుకంటే వాళ్లు యావేకు అంకితమైన జనం - 19, 5-6. ఈ భావాలన్నీ యిస్రాయేలుకు నచ్చాయి. వాళ్లు ఒక్క గొంతుతో మేము ప్రభువు చెప్పినట్లే చేస్తామని జవాబు చెప్పారు - 19,8.

2.నిబంధన బలి :

యిస్రాయేలీయులకు సమకాలికులైన హితీయులు మొదలైన జాతులవాళ్లు మూడురకాలుగా నిబంధనం చేసికొనేవాళ్ళు. 1) ఇరుపక్షాలవాళ్లు చేతులమీద కోసికొని నెత్తురు కలుపుకొనేవాళ్లు. ఈలాంటి నిబంధనం బైబుల్లో కన్పించదు. 2) ఇరువురూ బలిజంతువుల తుండెముల మధ్యగా నడిచేవాళ్లు, పూర్వం దేవుడు అబ్రాహాముతో ఈ పద్ధతిలో ఒడంబడిక చేసికొన్నాడు - ఆది 15,9-12, 3) ఇరువురూ కలసి భోజనం చేసేవాళ్లు, ఈసాకు అబీమెలెకు ఈలా భుజించారు - ఆది 26, 28 -30. ఈ పద్దతులన్నిటిలోను ముఖ్యభావం యిది. నిబంధనం చేసికొన్న వారిద్దరూ రక్తబంధువుల్లాంటివాళ్లు, సోదరుల్లాంటివాళ్ళు, కనుక ఆ యిరువురూ దాన్ని జాగ్రత్తగా పాటించాలి.

కాని యిక్కడ ప్రభువు మోషేతో చేసికొన్న నిబంధనం ఇంకో పద్ధతిలో నడిచింది. మోషే కొండవద్ద పూజాపీరాన్ని నిర్మించాడు. ప్రజలను ప్రోగుజేసాడు. బలికి కోడెలను వధించి వాటి నెత్తురు పళ్లాల్లో సేకరించారు. మోషే ఆ నెత్తుటిలో సగం పీఠంమీద చల్లాడు. మిగతా సగం ప్రజలమీద చిలకరించాడు. యావే మిూకీ నియమాలను ప్రసాదించాడు. అతడు మీతో చేసికొన్న నిబంధన రక్తం యిది" అని పల్మాడు - 24,4-8.