పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెచ్చుకోవచ్చు. పూర్వం తాననుభవించిన కష్టాలకు బదులుగా ఇప్పడు సుఖాలు అనుభవింపవచ్చు. ఐనా యోసేపు నైతిక విలువలు చాల గొప్పవి. ఆ విలువలముందు ఈ లౌకిక లాభాలు గడ్డిపోచతో సమానం.

4.ఇక్కడ యోసేపు విలువలను జాగ్రత్తగా గమనించాలి. అతడు యజమానుడు తనకు మేలుచేసాడు కనుక తాను అతనికి ద్రోహం తలపెట్టకుండా వుంటాననుకోవచ్చు లేదా ఆ స్త్రీ యజమానుని భార్య కనుక ఆమెను ముట్టుకోకుండా వుంటాననుకోవచ్చు. కాని అతనికి ఈ రెండిటి కంటెగూడ మూడవ కారణం బలమైంది. అతడు తాను ఆ స్త్రీని కూడడం భగవద్రోహం అనుకొన్నాడు - 89,9. దేవుడు చూస్తుండగా ఆలాంటి దుష్కార్యం చేయగూడదనుకొన్నాడు. భగవంతునిపై యోసేపుకున్న భక్తిభావం అంతగొప్పది. ఇక్కడ ఒక్క హీబ్రూ రచయిత మాత్రమే ఈ భావాన్ని సూచించగలడు. ఈజిప్షియులకు ఈ నైతిక విలువలు తెలియవు.

శోధనం దానంతట అది పాపంకాదు. దుష్టమైన కోరిక పుట్టినంతమాత్రాన్నే పాపం చేసినట్లు కాదు. మనం దానికి సమ్మతిస్తే, దాన్ని తలంచుకొని ఆనందిస్తే అది పాపం. ఇక్కడ యోసేపు శోధనం చివరిమెట్టు చేరుకోలేదు.

యజమానుని భార్య తన పైబట్ట పట్టుకోగా యోసేపు దాన్ని ఆమె చేతుల్లోనే వదలివేసి ఆ యింటినుండి పారిపోయాడు. ఈలాంటి కామసంబంధమైన కోరికలు వచ్చినపుడు వాటితో చలగాటమాడుతూ కూర్చోకూడదు. పారిపోవడమే శ్రేయస్కరం. విశేషంగా కామానికి ఇదే విరుగుడు. ఆనాటి యువకులు యోసేపు చర్యకు నవ్వివుండవచ్చు ఈనాటి వాళ్ళకూడ అతడు వట్టి అసమర్ణుడు అనుకోవచ్చు. మన సినిమాలు, నవలలు, నాటకాలు తరచుగా పుణ్యాన్ని చేతగానితనంగాను పాపాన్ని సామర్థ్యంగాను, ఆకర్షణీయమైన దాన్ని గాను చిత్రిస్తాయి. కాని భగవద్భక్తులు పాపాన్ని జయించి పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ శోధనకు లొంగిపోయి యోసేపు ఆనాడు ఆ స్త్రీని కూడినట్లయితే నేడతడు మనకు మాన్యు డయ్యేవాదేనా? ఇప్పడతన్ని మనం గౌరవభావంతో స్మరించుకొనే వాళ్లమేనా?

ఇంతయెందుకు? బైబుల్లోనే దావీదు చరిత్రవుంది. అతడు సాయంత్రంపూట మేడపై పచార్లు చేస్తూ ప్రక్కింటిలో స్నానం చేసికొనే బతేబాను చూచాడు. ఆ చూపుతోనే అతనికి మతిపోయింది. అతని హృదయం దేవునికి దూరమైంది. అతడు ఆ స్త్రీని యింటికి రప్పించుకొని ఆమెతో పాపం చేసాడు–2 సమూ 11,2-4, అతనికి తాత్కాలిక సుఖం కలిగింది. కాని తన పాపానికి జీవితాంతం పశ్చాత్తాప పడవలసి వచ్చింది. నేడు మనం అతన్ని దుర్భలుద్దీగా ఎంచుతాం గాని ఆదర్శప్రాయుణ్ణిగా గణించం. అతని చర్యను