పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్టలు నిటారుగా నిలబడివున్న అతని కట్టకు దండం పెట్టాయి. అతడు సోదరులమీద అధికారం నెరపుతాడని ఈ కల భావం. యోసేపుకి వచ్చిన రెండవ కల యిది. సూర్య చంద్రులు, పదకొడు నక్షత్రాలు అతనికి నమస్కారం చేసారు. సోదరులూ తల్లిదండ్రులూ యోసేపుకి దండంపెడతారని ఈ కల అర్థం. ఈ కలలను విని తోబుట్టువులు యోసేపుపై మండిపడ్డారు. అతన్ని ఇంకా యొక్కువగా ద్వేషించారు.

బానిసగా అమ్ముడుపోవడం

యాకోబు కొడుకులు షెకెములో గొర్రెలు కాచుకొంటున్నారు. యాకోబు యోసేపని అన్నల వద్దకుపోయి వారి మంచిచెడ్డలు తెలిసికొని రమ్మన్నాడు. యోసేపు వెళ్లేప్పటికి సోదరులు దోతానుకి కదలిపోయారు. వాళ్ళు ఎక్కడ పచ్చిక బాగావుంటే అక్కడికి మందలను తోలుకొని పోయి మేపేవాళ్ళు ఈ దోతాను చాలమార్గాలు కలసేతావు. వర్తకులు ఈ బాటలవెంట ప్రయాణం చేసేవాళ్ళ.

అన్నలకు యోసేఫంటే గిట్టదు కదా! కనుక వాళ్లతన్ని చంపివేద్దామనుకొన్నారు. మల్లా మనసు మార్చుకొని నీళ్లులేని బావిలో పడద్రోసారు. అతడు ఆ గోతిలో కొంత కాలమున్నాడు. మిద్యాను వర్తకులు ఆ దారివెంట వెళూ అతన్ని బయటికిలాగి 22నాణాలకు యిష్మాయేలీయులకు అమ్మారు. మిద్యానీయులు అబ్రాహాము భార్యయైన కతూరా సంతతివాళ్ళు. యిష్మాయేలీయులు అబ్రాహము భార్య హాగారు సంతతివాళ్ళు. యిష్మాయేలీయులు యోసేపని ఈజిప్టుకు కొనిపోయారు.

సోదరులకు యోసేపుమీద అక్కసు ఇంకా తీరలేదు. వారు అతని అంగీని మేకపిల్ల నెత్తుటిలో మంచి తండ్రివద్దకు పంపారు. నీ ముద్దుల కొడుకుని ఏదో వన్యమృగం చంపివేసింది. ఇది వాని అంగీ అని కబురు చెప్పించారు. యాకోబు తన కొడుకు నిజంగానే చనిపోయాడనుకొని అతని కొరకు ఎంతగానో విలపించాడు.

యిష్మాయేలీయులు యోసేపుకి సంకెలలు వేసి అతన్ని బానిసగా ఈజిప్టుకి కొనిపోయారు. అక్కడ సంతలో అతన్నివేలం వేసారు. యోసేపు అప్పటికి 27 సంవత్సరాల యువకుడు. కండలు తీరి పుష్టిగా వున్నాడు. బాగా పని చేసేలావున్నాడు. కనుక చాలమంది యజమానులు అతని కొరకు పాటపాడారు. చివరకు పోతీఫరు అతన్ని కొన్నాడు. ఇతడు సైనికోద్యోగి. రాజు అంగరక్షకులకు నాయకుడు.

పోతీఫరు ఇంటిలో

పోతీఫరు ఇంటిలో యోసేపు ఏలా మెలిగాడు? దేవుడు యోసేపుకి తోడుగా వున్నాడు. కనుక అతడు చేపట్టిన కార్యాలన్నీ విజయవంతమయ్యాయి - 39,23. పోతీఫరు ఈ సంగతిని గుర్తించాడు. అతనికి ఈ కొత్త బానిస పై అభిమానం పెరిగింది. అతన్ని