పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. యోసేవకథ

బైబులు భాష్యం - 183

యోసేపు కథ బైబుల్లోని సుప్రసిద్ధకథల్లో వొకటి. ఈ కథ ప్రధానంగా దైవ కటాక్షాన్ని తెలియజేసేది. మంచి కథకు వుండే లక్షణాలన్నీ - యవనం, సౌందర్యం, చైతన్యం, నాయకత్వం, అసూయాద్వేషాలూ, శోధనలూ, కష్టాలు దుఃఖాలు, పశ్చాత్తాపం, అపరాధక్షమ, మహానుభావత్వం - దీనికీ వున్నాయి. ఈ కథను చదువుతూంటే కండ్లవెంట నీళ్ల కారతాయి. ఇది మంచికథ లక్షణం. ఆదికాండ ఈ కథ ఈజిప్టులో, హిక్సోసు రాజవంశం పరిపాలనాకాలంలో, క్రీ.పూ. 17వ శతాబ్దంలో జరిగినట్లుగా చెప్తుంది.

యోసేపు బాల్యం

వంశపారంపర్యంగా వచ్చిన లక్షణాల ప్రభావం, పరిసరాల ప్రభావంకూడ పిల్లలపై వుంటుంది. యోసేపు చిన్ననాడే చాల విషమపరిస్థితులను చవిజూచాడు. అతడు మెసపొటామియాలోని పదనారాములో పుట్టాడు. అతని మేనమామ లాబాను పారిపోయే అతని తండ్రి యాకోబును తరుముకొంటూ వచ్చాడు. అతని పెదతండ్రి యేసావు నాలువందలమంది మనుష్యులతో అతని తండ్రి యాకోబును కలసికోవడానికి వచ్చాడు. దేవదూత ఒక రాత్రంతా అతని తండ్రితో కుస్తీపట్టాడు. షెకెము వద్ద అన్యజాతివారు అతని అక్కదీనాను మానభంగం చేయగా అతని సోదరులు వారిపై పగతీర్చుకొన్నారు. యోసేపు సోదరులు పదిమందికి అతనిపై చిన్ననాటినుండి అసూయ వుండేది. ఈ సంఘటనలన్నీ యోసేపు లేత హృదయంపై చెరగని ముద్ర వేసివుంటాయి.

యోసేపు యాకోబుకి ముసలి ప్రాయంలో పుట్టిన కుమారుడు. పైగా యాకోబుకి మొదటి భార్యయైన లేయాకంటె రెండవ భార్యయైన రాహేలంటే ఎక్కువ యిష్టం. ఈ రాహేలు బిడ్డలే యోసేపు బెన్యామీనులు. కనుక ఈ యిద్దరు పిల్లల ప్తె యాకోబుకి ఎక్కువ ప్రీతి, అతడు యోసేపుకి చారలుకల పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించాడు. ఆ రోజుల్లో ప్రముఖుల, ధనవంతులు ఈలాంటి అంగీలను తాల్చేవాళ్ళు కనుక సోదరులకు యోసేపుపై అసూయపట్టింది – 37, 3-4 పైగా అతడు సోదరులు చేసిన చెడ్డపనులను తండ్రికి తెలియజేసాడు. అందుచే వారికి అతనిపై ద్వేషం కూడ పెరిగింది. తండ్రికి అతనిపైగల విశేషానురాగమే అతని తిప్పలకు కారణమైంది.

యోసేపు కలలు కనేవాడు. అతనికి చిన్ననాడే రెండు కలలు వచ్చాయి. మొదటి కలయిది. అతడూ సోదరులూ పొలంలో పైరుకోసి కట్టలు కట్టారు. కాని సోదరుల