పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10 ఆ తోట మంచి చెట్లతో నదులతో అలరారుతూ తూర్పు వైపున ఉండేది - 2, 814. ఆదిదంపతులు సౌభాగ్యమైన దశలోను సంతోషకరమైన స్థితిలోను జీవించేవాళ్లు

11 ఆ తోటలో ప్రాణమిచ్చే చెట్టు వుండేది - 2, 9. ఆదిదంపతులుకు మృత్యువు లేదు.

12 ఆ తోటలో మంచి సెబ్బరలను తెలియజేసే చెట్టు కూడ వుండేది - 2, 9. నరుడు స్వతంత్రంగా ప్రవర్తించకూడదు. దేవుని మీద ఆధారపడి జీవిస్తుండాలి.

13 నరుడు జంతువులకు పేర్లు పెట్టాడు - 2, 19, ఆ జంతువుల కన్నిటికీ నరుడుఅధిపతి.

14 ఆ జంతువులలో నరునికి తోడుగా వుండదగిన దేదీ లేదు - 2, 20. అతడుజంతువుల కంటె పై స్థాయిలోని వాడు. అతని కోవ వేరు, వాటి కోవ వేరు.

15 దేవుడు సాయంకాలం తోటలో తిరుగాడుతూ ఆదామేవలను పిల్చాడు - 3, 8. దేవుడు ఆది దంపతులతో స్నేహంగా మెలిగేవాడు.

16 దేవుడు ఆదాముని జ్ఞానవృక్షం ఫలాలు తినవద్దన్నాడు – 2, 17. ఆదిదంపతుల సౌభాగ్యస్థితి వాళ్ల విధేయతమీద ఆధారపడి వుంటుంది.

17 పాము ఏవతో సంభాషణం ప్రారంభించింది - 3, 30. దుషుడైన సైతాను ఏవను శోధించాడు.

18 ఏవా ఆదామూ తినకూడని పండు తిన్నారు — 3, 6. వాళ్లిద్దరూ దేవుని ఆజ్ఞ మీరారు.

19 దేవుడు ఆది దంపతులను తోట నుండి వెళ్లగొట్టాడు — 3, 23. వాళ్లు తామున్న సౌభాగ్య స్థితిని పోగొట్టుకొన్నారు.

20యావే ఏదెను తోటకు ఓ దేవదూతనూ కత్తినీ కాపంచాడు — 3, 24. నరజాతికిఆ తొల్లిటి సౌభాగ్య స్థితి దక్కకుండా పోయింది.

21 స్త్రీ సంతతి పాము తల చితుకగొడతారు - 3, 15, స్త్రీ సంతానమైన లోకరక్షకుడు పిశాచాన్ని జయిస్తాడు.