పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఈ సంకేతాలను ఉన్నవాటిని ఉన్నట్లుగా నమ్మనక్కర లేదు. అవి బోధించేభావాలను మాత్రం నమ్మాలి. ఉదాహరణకు ఆదామేవలు తినవద్దన్న పండు తిన్నారు అన్నది సంకేతం. వాళ్లు ఏదో రూపంలో దేవుని ఆజ్ఞ మీరారు అన్నది ఆ సంకేతం భావం, నేడు మనం ఆదామేవలు దేవుని ఆజ్ఞమీరారు అని నమ్మాలి, కాని వాళ్లు తినవద్దన్న పండు తిన్నారని మాత్రం నమ్మనక్కర లేదు. మిగతా సంకేతాలు విషయం గూడ ఇంతే.

1 దేవుడు ఆరు రోజులు సృష్టిచేసి ఏడవ రోజు విశ్రాంతి తీసికొన్నాడు - 2, 2 నరులు విశ్రాంతి దినాన పనులు చేయకూడదనీ, అది పవిత్రమైన దినమనీ ఈ సంకేతం భావం.

2 దేవుడు తనకు పోలికగా నరుద్ధి చేసాడు - 2, 26. సృష్టి వస్తువులన్నిటి మీదానరుడు అధికారం చూపుతాడు.

3 ప్రభువు మట్టినుండి నరుడ్డి చేసి అతని ముక్కుగోళ్లల్లోనికి ప్రాణవాయువు నూదాడు - 2,7. నరుడు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడి జీవించేవాడు.

4 యావే నరుని ప్రక్కటెముక తీసికొని స్త్రీని చేసాడు - 2, 22. స్త్రీ గూడ పురుషుని లాంటిది. వాళ్లిద్దరిదీ ఒకే స్వభావం. వాళ్లిద్దరూ ఒకే కోవకు చెందినవాళ్లు, వాళ్లల్లో హెచ్చుతగ్గులు లేవు.

5 దేవుడు ఆదామునకు గాఢనిద్ర కలిగించి అతని ప్రక్కటెముకను తీసాడు - 2,21.సృష్టి రహస్యాలను నరుడు చూడకూడదు.

6 నరుడు తొలి స్త్రీని చూచి “ఈమె నా యెముకల్లో యెముక, నా దేహంలో దేహం అనుకొన్నాడు – 2, 23. ఆమె అతనికి ఆపరాలు, బంధువురాలు, ప్రియురాలు.

7 నరుడు తొలి స్త్రీకి నారి అని పేరు పెట్టాడు - 2, 23. స్త్రీ పురుషుని అధీనములో వుంటుంది.

8 ఆదిదంపతులు దిసమొలతో వున్నావాళ్లకు సిగ్గువేయలేదు- 2,25. ఇంకా పాపం చేయలేదు గనుక వాళ్లల్లో కామవికారం లేదు.

9 దేవుడు నరుణ్ణి ఏదెను తోటలో వుంచాడు - 2.15. దేవుడు నరుణ్ణి సౌభాగ్యదశకు కొనివచ్చాడు.