పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతతి అని కాదు. ఏవ సంతతి అనే అర్థం. కాని ఆ యర్ధంలో క్రీస్తూ మరియా ఇద్దరూ ఇమిడే వున్నారు. మరియను ప్రాచీన క్రైస్తవ రచయితలు "రెండవ ఏవ" అని పేర్కొన్నార్లు గూడ

2.ఆదాము పాపం సంతోషకరమైంది

భక్తుడు అగస్టీను ఆదాము పాపం సంతోషకరమైంది అన్నాడు. ఆదాము పాపం చేయకుండా వుండడంకంటె చేయడమే మేలైంది అన్నాడు. ఎందుకు? ఆదాము పాపం వలన క్రీస్తు అంతటి రక్షకుడ్డి పొందగలిగాం, లోకరక్షకుడైన క్రీస్తు మన పాపానికి పరిహారం చేసాడు. మనకు మల్లా దేవునితో స్నేహాంకలిగించాడు. ఆదాము అనుభవించిన ఆ తొల్లిటి సౌభాగ్య దశను మల్లా నెలకొల్పాడు.

కాని ఆదాము అనుభవించిన సౌభాగ్య దశకూ క్రీస్తు నెలకొల్పిన సౌభాగ్య దశకూ కొన్ని వ్యత్యాసాలున్నాయి. 1. క్రీస్తు అమరత్వాన్ని పునస్థాపనం చేయలేదు. పాపానికి ముందు ఆదాము చనిపోయ్యేవాడు కాదు. కాని మన మిప్పడు చనిపోతున్నాం. ఐనా చనిపొయ్యాక ఆక్రీస్తులాగే మనమూ ఉత్తాన మౌతాం. ఆ ప్రభువులాగే మనమూ జీవంతో లేచి మోక్షాన్ని చేరుకొంటాం, ఆ మీదట శాశ్వతంగా ఆమరులమై పోతాం. 2. క్రీస్తు వ్యాధిబాధలను నిర్మూలించ లేదు. పాపానికి ముందు ఆదాముకు వ్యాధిబాధలుండేవి కావు. కాని నేడు మన కున్నాయి. ఐనా ప్రభువు బాధల ద్వారా మన బాధలు ఫలితాన్ని పొందుతాయి. మనకు వరప్రసాదాన్ని ఆర్ధించిపెడతాయి. 3. మనం పాపం చేయగలం, దేవునితోడి స్నేహాన్ని కోల్పోగలం. అనగా మనమూ ఆయాదాములాగే ప్రవర్తింపగలం. పతనమై పోగలం. ఈ యపాయాన్ని క్రీస్తు తొలగింపలేదు. అంచేత మనం భయభక్తులతో ప్రవర్తింస్తుండాలి. రక్షణమార్గంలో నడుస్తుండాలి. ఇవి క్రీస్తు నెలకొల్చిన నేటి సౌభాగ్య దశలో కన్పించే కొన్ని లక్షణాలు.

భగవంతుడు నరుణ్ణి ఎప్పడూ చేయివిడువడు అన్నాం. నరుడు పాపంచేసినాగనీ అతనికి కొండంతటి రక్షకుణ్ణి అనుగ్రహించాడు. ఆ రక్షకుడుడే క్రీస్తు, ఆదాము ఈ క్రీస్తుని సూచిస్తుంటాడు. ఆ యాదాము సంతతివాళ్లమైన మన సౌభాగ్యమంతా ఈ క్రీస్తుతో ఐక్యంగావడంలోనే ఇమిడి వుంది.

8. సంకేతాలూ వాటి భావమూ

ఆదికాండం తొలి మూడధ్యాయాల్లో రచయితలు చాలా సంకేతాలు వాడారు. వీటి భావాలను పూర్వాధ్యాయాల్లో వివరించాం. కాని స్పష్టత కోసం వాటి నన్నిటినీ మల్లా ఇక్కడ ఓ జాబితాగా పొందుపరుస్తున్నాం.