పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వతంత్రంగా ప్రవర్తింప గోరాడు. తాను ఆదేవుని మీద ఆధారపడి జీవించడానికి నిరాకరించాడు. అతని పాపం విశేషంగా గర్వంతో కూడింది. ఈ పాపాన్నే రచయిత ప్రజల కర్థమయ్యేలా తినకూడని పండు తినడం అన్న సంకేతంతో చెప్పకొంటూ బోయాడు.

ప్రాచీనులు కొందరు ఆదాము ఏవను కూడి పాపం చేసాడని అభిప్రాయ పడ్డారు. వాళ్ల దృష్టిలో ఆదాము పాపం లైంగిక పాపం. కాని ఇది పొరపాటు. 1,28లో ప్రభువు "మీరు సంతానాన్ని కని అభివృద్ధికండి" అంటాడు. ఆలాంటి ఆజ్ఞనిచ్చిన దేవుడు ఆదాము ఏవను కూడితే కోపపడతాడా? కనుక అతని పాపం లైంగికమైందికాదు అని చెప్పాలి. అని గర్వానికీ స్వేచ్చా ప్రవర్తనకూ సంబంధించిందని మీద చెప్పాం.

తొలి ఆదాము ద్వారా పాపమూ మరణమూ సిద్ధించాయి. కాని మలి ఆదాము ద్వారా వరప్రసాదమూ జీవమూ లభించాయి. ఆదాము తెచ్చిపెట్టిన శాపాలకు మించినవి క్రీస్తు ఆర్థించిన సౌభాగ్యాలు. ఆదాము పాపం మనకందరకు సంక్రమిస్తుంది. మనం అతని సంతతివాళ్లం గనుక పుట్టుకతోనే అతని పాపాన్ని పొందుతాం. అదే జన్మపాపం. కాని క్రీస్తుద్వారా, అతని లోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా, ఈజన్మపాపం తొలిగిపోతుంది. కనుక ఆదాము మనకు మరణాన్ని కలిగించే తండ్రి ఐతే, క్రీస్తు మనకు జీవాన్నిచ్చే తండ్రి - రోమా 5, 18–22.

7. లోక రక్షకుడు

1. స్త్రీ సంతతి

నరుడు ఎన్ని పాడుపనులు చేసినా భగవంతుడు మాత్రం అతన్ని చేయి విడువడు. నిత్యం అతన్ని కరుణతో ఆదరిస్తూనే వుంటాడు. ఆదాము పాపం దేవుణ్ణి ధిక్కరించినా దేవుడతన్ని పరిత్వజించ లేదుగదా, అతని రక్షణమార్గం వెదికాడు. స్ర్తీ సంతతికీ పిశాచం సంతతికీ తీరని వైరం కలుగుతుంది. ఐనా స్త్రీ సంతతివాళ్లు పిశాచం తల చితుక గొడతారు. దాన్ని జయిస్తారు. పిశాచం కూడ స్త్రీ సంతతిని కొంతవరకు బాధిస్తుంది. వారి మడిమలు కరుస్తుంది. ఐనా వారిని జయించలేదు — 3, 15. ఇక్కడ సంతతి అంటే యెవరు? ఏవ సంతతి ఐన నరులంతాను. కాని ఆ నరుల్లో ఓ ప్రముఖవ్యక్తి నరులందరికీ నాయకత్వం వహిస్తాడు. అతడే క్రీస్తు, నిత్యం మనకు పిశాచంతో పోరాటం జరుగుతుంటుంది. ఆ పోరాటంలో క్రీస్తు మనకు నాయకుడు. అతనితో గూడి మనం పిశాచాన్ని జయిస్తాం. దాని తల చితుకగొడతాం. పిశాచంతోడి పోరాటంలో క్రీస్తు మనకు నాయకుడైతే, అతని తల్లి మరియ మనకు సహాయకురాలు. పై వాక్యంలో "స్త్రీ సంతతి" అంటే మరియ