పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేఖ 5వ అధ్యాయంలో పౌలు వివాహ జీవితాన్ని గూర్చి చెప్పిన వాక్యాలు నేటికీ పెండ్లి పూజలో చదువుతూంటాం.

ఫిలెమోను

ఫిలెమోను అనే సంపన్నుని బానిస ఒనేసిమస్ పారిపోయాడు. ఇతడు రోములో పౌలువల్ల ఉపదేశంపొంది క్రైస్తవుడయ్యాడు. ఈ బానిసను దండించవద్దని పౌలు ఫిలెమోనుకు వ్రాసాడు. అదే యీ జాబు

తిమోతి జాబులు

ఈ జాబులు 65 ప్రాంతంలో వ్రాసినవి. వీటి కర్తృత్వం సందేహాస్పదం. పౌలుగాని అతని శిష్యులు గాని వ్రాసి వుండవచ్చు. పౌలు బోధించిన వేదసత్యాలను అతని శిష్యులైన తిమోతి మొదలైనవాళ్ళ పవిత్రంగా ఎంచాలనీ వాటిల్లో ఏలాంటి మార్పులూ చేయరాదనీ ఈ జాబుల సారాంశం.

తీతు జాబు

ఇది శిష్యుడైన తీతుకు వ్రాసిన జాబు. తిమోతి జాబుల్లాగే ఇదికూడ పౌలు బోధల్లో మార్పులు చేయరాదని చెప్పంది.

హెబ్రేయుల జాబు

ఇది 67 ప్రాంతంలో వ్రాసింది. పౌలు శిష్యుడెవరో వ్రాసి వుండవచ్చు. యూదమతంలోని యాజకులు కొందరు క్రైస్తవ మతంలో చేరారు. కాని వాళ్ళు వేదహింసలకుజంకి మల్లా యూదమతంలోకి వెళ్ళగోరుతుంటే gelo చేయవద్దని హెచ్చరిస్తూ వ్రాసిన జాబు ఇది. ఈ లేఖ ప్రధానంగా క్రీస్తు యాజకత్వాన్ని వర్ణిస్తుంది.

యాకోబు జాబు

యెరూషలేము క్రైస్తవ సమాజానికి అధిపతియైన యూకోబు దీన్ని యూదక్రైస్తవులకోసం 45 ప్రాంతంలో వ్రాసాడు. క్రైస్తవులు పర్వతప్రసంగం బోధల ప్రకారం జీవించాలి. దరిద్రులు దీనులు, హింసితులు దేవునికి స్నేహితులౌతారు. ఈ జాబు చాల నీతిబోధలతో నిండివుంటుంది.

యూదా జాబు

80 ప్రాంతంలో వ్రాసిన జాబు ఇది. ఆనాటి దబ్బర బోధకులనూ వాళ్ళ సిద్దాంతాలనూ ఖండిస్తుంది.