పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలతీయుల జాబు

పౌలు ఈ జాబునుకూడ 57 ప్రాంతంలో ఎఫెసు నుండే వ్రాసాడు. పౌలు ప్రత్యర్ధులైన యూదబోధకులు ధర్మశాస్త్రం మనలను రక్షిస్తుందని బోధించారు. క్రీస్తు వచ్చాక ఆ ప్రభువేగాని ధర్మశాస్త్రం మనలను రక్షించదని బోధించాడు పౌలు. రక్షణమనేది దేవుడు ఉచితంగా దయచేసే వరంగాని మన సత్ర్కియలతో సాధించేది కాదనిగూడ తెలియజేసాడు. క్రైస్తవులకు సున్నతి అక్కరలేదని చెప్పాడు.

రోమీయులు జాబు

దీనిని గలతీయుల జాబు వ్రాసిన తర్వాత 56 ప్రాంతంలో కొరింతు నుండి వ్రాసాడు. గలతీయుల జాబులోని విషయాలే దీనిలోగూడ ప్రస్తావింపబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం వలన ఇక లాభంలేదు. తండ్రి క్రీస్తుద్వారా ప్రజలను రక్షించాడు. ఇప్పడు మనం క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొంది రక్షణం పొందాలి. క్రైస్తవులు నూత్న యిస్రాయేలు ఔతారు. వాళ్ళు ప్రేమజీవితం జీవించాలి. ఈ జాబులో లోతైన దైవశాస్తాంశాలున్నాయి. పౌలు జాబులన్నిటిలోను ఇది యొక్కువ విలువైంది.

ఫిలిప్పీయుల జాబు

పౌలు ఫిలిప్పి క్రైస్తవులను మెచ్చుకొంటూ 56 ప్రాంతంలో వ్రాసిన జాబు ఇది. స్నేహపూర్వకమైన కుశలప్రశ్నలతోను వ్యక్తిగత సమాచారాలతోను నిండివుంటుంది. రెండవ అధ్యాయంలో క్రీస్తు వినయాన్నీ మహిమనీ తెలియజేసే గొప్ప గేయాన్ని ఉదాహరించడం జరిగింది.

కొలోస్సీయుల జాబు

60 ప్రాంతంలో రోములోని చెరలో నుండి వ్రాసిన జాబు. క్రీస్తు దేవదూతలలో ఒకడనీ, దేవదూతలను పూజిస్తే దేవుణ్ణి చేరతామనీ దబ్బర సిద్దాంతాలు బయలుదేరాయి. ఈ సిద్దాంతాలకు లొంగవద్దని పౌలు కొలొస్సే పౌరులను హెచ్చరించాడు. క్రీస్తు నిజమైన దేవుడనీ దేవదూతలు అతనికి లొంగి వుంటారనీ ఉపదేశించాడు.

ఎఫెసియల జాబు

61 ప్రాంతంలో వ్రాసిన లేఖ. తండ్రి రక్షణ ప్రణాళికలన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ఈ లోకంలో ఉత్తాన క్రీస్తుసాన్నిధ్యాన్ని తిరుసభ కొనసాగించుకొని పోతూంటుంది. ఈ