పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జెకర్యా

ఇతడు కూడ హగ్గయి సమకాలికుడు. అతనివలె ఇతడు కూడ దేవాలయాన్ని పునర్నిర్మించమని ప్రజలను హెచ్చరించాడు. ప్రజలు దేవాలయంలాగే పవిత్రంగా వుండాలనీ, మెస్సీయా రాజు త్వరలో వేంచేస్తాడనీ బోధించాడు. ఈ గ్రంథంలో 9-14 అధ్యాయాలు జెకర్యా చెప్పినవి కావు. 4వ శతాబ్దంలో ఇతరులు చేర్చినవి.

మలాకీ

ఈ ప్రవక్త 445 ప్రాంతంలో ప్రవచించాడు. హగ్గయి జెకర్యా ప్రవక్తల అనంతరం ప్రజల్లో మతపరమైన ఉత్సాహం నశించింది. వాళ్ళు అన్యజాతులతో వివాహాలు ప్రారంభించారు. విడాకులు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మలాకీ యాజకులూ ప్రజలూ కూడ పవిత్రులుగా జీవించాలని ప్రబోధించాడు. ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో ఇతడు పేర్కొనిన పరిశుద్ధమైన బలి నూత్న వేదంలోని కల్వరి బలికి వర్తిస్తుంది.

ఓబద్యా

ఇతడు 5వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని పుస్తకం ప్రవక్తల గ్రంథాలన్నిటిలోను చిన్నది .21 వచనాలు మాత్రమే. ఈ ప్రవచనం ఎదోమీయులమీద శాపవచనాలు. వీళ్లు యిప్రాయేలీయులకు పొరుగుజాతివాళ్లు. 586లో బాబిలోనీయులు యెరూషలేము దేవళాన్ని నాశం చేస్తూంటే వీళ్ళు కూడ ఆ శత్రువులతో చేతులు కలిపారు. అందుకే వాళ్ళమీద ఈ శాపవచనాలు.

యోవేలు

ఇతడు నాల్గవ శతాబ్దానికి చెందినవాడు. ఇతని కాలంలో మిడతలదండు దిగివచ్చి దేశాన్ని నాశం చేసింది. ఈ సంఘటనను ఆధారంగా తీసికొని ప్రవక్త ప్రజలు దైవశిక్షకు భయపడి తమ పాపాలకు పశ్చాత్తాపపడాలనీ విశుద్ధజీవితం జీవించాలనీ బోధించాడు. ప్రార్థనలూ ఉపవాసాలూ చేయాలని ప్రబోధించాడు. విశేషంగా ఇతడు, మెస్సీయా కాలం వచ్చినపుడు దేవుడు తన ప్రజలందరిమీద పవిత్రాత్మను కుమ్మరిస్తాడని నుడివాడు. నూత్నవేదంలో పవిత్రాత్మ శిష్యులమీదికి దిగివచ్చినపుడు ఈ ప్రవచనం నెరవేరింది. కనుక ఇతడు పవిత్రాత్మకు సంబంధించిన ప్రవక్త

యోనా

ఈ గ్రంథకర్త నాల్గవ శతాబ్దానికి చెందినవాడు. యోనా కథ చారిత్రకం కాదు, కల్పితమైన నీతి కథ. యూదులు. సంకుచితమైన మనస్తత్వంతో తాము మాత్రమే రక్షణం పొందుతామనీ అన్యజాతులన్నీ నశిస్తాయనీ చెపున్నారు. ఎజ్రా నెహేమ్యా సంస్కరణలు కూడ యూదులకు అన్యజాతులతో సంపర్కం పనికిరాదని చెప్పాయి. ఈలాంటి పరిస్థితుల్లో