పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసికొంటాడు. ఇది ఈ ప్రవక్త సందేశం, ఈ పుస్తకంలో ప్రవక్త మాటలు మాత్రమేకాక అతని జీవితం కూడ ప్రవచన మౌతుంది. ఈ దృష్టితో చూస్తే ఇది బైబుల్లో విలక్షణమైన గ్రంథం. ఈ ప్రవక్త భగవంతునికి ప్రజలపట్ల వుండే ప్రేమ భర్తకు భార్యపట్ల వుండే ప్రేమలాంటిదని చెప్పాడు. ఈ భావం నూత్నవేదంలోకిగూడ ప్రవేశించింది. తిరుసభ క్రీస్తు వధువు అనే భావానికి ఆధారం హోషేయ ప్రవచనమే. పూర్వవేదంలో యెషయా యిర్మీయా వంటి మహాప్రవక్తలు హోషేయ వలన ప్రభావితులయ్యారు.

మికా

ఇతడు దక్షిణరాజ్యమైన యూదాకు చెందినవాడు. యెషయాకు సమకాలికుడు. ప్రజలు తమ దుర్బుద్దులను మార్చుకొని దేవునికి విధేయులు కావాలనీ, లేకపోతే ప్రభువు యిస్రాయేలు రాజ్యాన్నివలె యూదారాజ్యాన్ని కూడ శిక్షిస్తాడనీ యితని ప్రధానబోధ, ఇతడు మెస్సీయా బెల్లెహేమలో పుడతాడని చెప్పాడు. నూత్ననేదంలో మత్తయి ఈ ప్రవచనాన్ని ఉదాహరించాడు.

జెఫన్యా

ఇతడు 640-609 కాలంలో జీవించాడు. ప్రభువు యూదాను శిక్షిస్తాడని ఇతని ప్రధానబోధ, ఇతడు దీనులైనవారిని ప్రభువు రక్షిస్తాడని చెప్పాడు. ఇతని నాటి నుండి యూదుల్లో దీనులవర్గం ప్రాముఖ్యంలోనికి వచ్చింది. నూత్నవేదంలో క్రీస్తూ మరియమాతా శిష్యులూ ఈ దీనుల వర్గానికి చెందినవాళ్ళు

నహూము

అస్పిరియా రాజధానియైన నినివే నాశమౌతుందని ఇతని ప్రవచనం. ఈ ప్రవక్త చెప్పినట్లే 612లో నినివే కూలింది.

హబక్మూకు

బాబిలోనియా యూదాను శిక్షిస్తుందనీ, అబుపిమ్మట ప్రభువు బాబిలోనియాను గూడ శిక్షిస్తాడనీ ఇతని బోధ. యూదాప్రజలకంటె దుష్టులైన బాబిలోనీయులు యూదాను శిక్షించడం దేనికా అని ఈ ప్రవక్త విస్తుపోయాడు. నరుడు భగవంతుణ్ణి నమ్మి జీవించాలని ఇతని ముఖ్యబోధ.

హగ్గయి

ఇతడు యూదులు బాబిలోనియా ప్రవాసంనుండి తిరిగివచ్చిన పిదప 520 ప్రాంతంలో ప్రవచించాడు. దేవాలయాన్ని పునర్నించాలనీ, రెండవ దేవాలయం మొదటి దేవాలయంకంటె వైభవంగా వుంటుందనీ ఇతని సందేశం.