పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ మతాన్ని విడనాడారు. కొందరు మాత్రం అతన్ని ప్రతిఘటించారు. వీరిలో యూదా, అతని సోదరులు ముఖ్యులు. వీరికే మక్కబీయులు అని పేరు. వీరు గ్రీకురాజు ఆక్రమణలనుండి యెరూషలేముకు విముక్తి కలిగించారు. దేవాలయాన్ని శుద్ధిచేసారు. మొదటి గ్రంథం ఈ చరిత్ర అంతా చెప్పంది. రెండవ గ్రంథం ఈ పోరాటంలో పాల్గొన్న వీరుల చరిత్రలను మరో దృక్కోణంనుండి వర్ణిస్తుంది. ఈ రెండు గ్రంథాలకు పరస్పర సంబంధం లేదు.

3. జ్ఞానగ్రంథాలు

అన్ని దేశాల్లోను జ్ఞానగ్రంథాలూ జ్ఞానసూక్తులూ వెలువడ్డాయి. జ్ఞానమంటే మంచి బుద్ధి, లేదా నీతి. మన దేశంలో పంచతంత్ర హితోపదేశాలూ నీతిశతకాలూ వున్నాయి. అలాగే యిప్రాయేలు ప్రజల్లోకూడ జ్ఞానులు విజ్ఞాన సూక్తులను ప్రచారంలోకి తెచ్చారు. ఈ జ్ఞానులు విశేషంగా రాజాస్థానాల్లో వర్ధిల్లారు. సొలోమోను రాజు జ్ఞానసాహిత్యానికి పోషకుడుగా కీర్తిగడించాడు. యూదుల జ్ఞానగ్రంథాలు ఎక్కువగా లౌకిక నీతినిగూర్చే మాట్లాడతాయి. ధర్మశాస్త్రం, నిబంధనం, ఎన్నిక, రక్షణం మొదలైన మతవిషయాలను అట్టే పేర్కొనవు. జీవితంలో విజయాన్ని సాధించడం ఏలా అనేది ఈ గ్రంథాల్లోని ముఖ్య ప్రశ్న. ఐనా దేవుని పట్ల భయభక్తులు చూపడమే విజ్ఞానంలోని ముఖ్యాంశం. యూదుల దృష్టిలో జ్ఞానం పుణ్యం. అజ్ఞానం పాపం, జ్ఞాని సజ్జనుడు. అజ్ఞాని దుష్టుడు.

6వ శతాబ్దంలో యూదుల రాజులు అంతరించారు. వాళ్ళ రాజ్యం నాశమైంది. అప్పటినుండి వాళ్ళ జ్ఞానులు రాజులకు మారుగా జ్ఞానమే ప్రజలను నడిపిస్తుందని చెపూ వచ్చారు. ఈ జ్ఞానుల్లో రెండు వర్గాలవాళ్ళన్నారు. మొదటి వర్గంవాళ్ళు ఆశావాదులు. వీళ్ళు జ్ఞానాన్ని అలవర్చుకొన్న నరులు సుఖశాంతులతో జీవిస్తారనీ విజయాలను చేపడతారనీ బోధించారు. రెండవ వర్గంవాళ్లు నిరాశావాదులు. వీళ్లు ఈ లోకంలో జ్ఞానీ సజ్జనుడూ ఐన నరుడు కష్టాలననుభవిస్తుంటే అజ్ఞానీ దుషుడూ ఐన నరుడు సుఖాలననుభవిస్తున్నాడని వాపోయారు. ఐనా ఈ యభయవర్గాల రచయితలూ నిజమైన జ్ఞానం కొరకు తపించిపోయారు. నూత్న వేదంలో క్రీస్తే మనకు జ్ఞానం. ఇక యీ వర్గానికి చెందిన పుస్తకాల్లో ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం.

యోబు

ఈ గ్రంథం యోబు భక్తుని చరిత్ర చెప్తుంది. అతడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణిదూషించలేదు, యోబు భక్తికి మెచ్చుకొని కడన దేవుడు అతన్ని బహూకరించాడు. లోక్షంలో మంచివాళ్ళకు కష్టాలెందుకు వస్తాయి అనేది ఈ పుస్తకం పరిష్కరించబూనిన సమస్య