పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రలను వర్ణించారు. పై నాలు గ్రంథాల్లో లేని నూత్న విషయాలు ఈ పుస్తకాల్లో తగులుతాయి.

ఎజ్రా, నెహెమ్యా

ఐదవ శతాబ్దంలో యూదులు బాబిలోనియా ప్రవాసం ముగించుకొని పాలస్తీనా దేశానికి తిరిగివచ్చారు. ఆ కాలంలో వాళ్ల నాయకులు యాజకుడైన యెజ్రా, రాష్టాధిపతియైన నెహెమ్యా వీళ్ళిద్దరూ ప్రజలను సంస్కరించడానికి చాల నియమాలు చేసారు. ధర్మశాస్తాన్నీ బలులనూ పునరుద్ధరించారు. యెరూషలేమును దేవళాన్నీ పునర్నిర్మించడానికి పూనుకొన్నారు. ఈ నాయకుల చరిత్రలను చెప్పేవే ఈ రెండు గ్రంధాలు. తరువాత వచ్చిన రూతు, యోనాగ్రంథాలు వీళ్ళ సంస్కరణల్లోని సంకుచిత భావాలమీద తిరుగుబాటు చేసాయి.

తోబీతు

యూదుల ప్రవాసకాలంలో జరిగిన కథలే తోబీతు, యూదితు, ఎస్తేరు గ్రంథాలు. ఇవి చారిత్రికాలు కాదు. కల్పిత కథలు. ఐనా చాల భక్తిమంతంగా వుంటాయి. తోబీతు అన్నా దంపతుల కుమారుడు తోబియా, ఇతడు రఫాయేలనే దేవదూత సహాయంతో గండాలన్నీ తప్పించుకొని సారాను పెండ్లియాడాడు. ఈ గ్రంథం కుటుంబధర్మాలను అతిలలితంగా వర్ణిస్తుంది. ఇది నాల్గవ శతాబ్దంలో పుట్టిన పుస్తకం.

యూదితు

అస్పిరియా సైన్యాధిపతియైన హోలోఫెర్నెసు యూదుల నగరమైన బెతూలియాను ముట్టడించాడు. ఆ నగరంలో వసించే వితంతువూ దైవభక్తురాలూ ఐన యూదితు హోలో ఫెర్నెసును వంచించి అతని శిరస్సును నరుక్కొని వచ్చింది. తమ సైన్యాధిపతి చావడం చూచి శత్రుసైన్యం పారిపోయింది. ఇది రెండవ శతాబ్దంలో పుట్టిన గ్రంథం.

ఎస్తేరు

యూదుల పర్యాదేశంలో ప్రవాసులుగా జీవిస్తున్నారు. వాళ్ళ ఆడపడుచు ఎస్తేరుఆ దేశపు రాజును పెండ్లిచేసికొంది. ఆ దేశపు మంత్రియైన హామాను కుట్రతో యూదులనునాశం చేయబూనాడు. ఎస్తేరురాణి హామాను కుట్రను భగ్నంచేసి అతన్ని ఉరితీయించి యూదులను కాపాడింది.

మక్కబీయుల గ్రంథాలు రెండు

రెండవ శతాబ్దంలో గ్రీకు రాజయిన అంటియోకస్ ఎపిఫానిస్ యూదులను హింసించాడు. యూదమతాన్ని బహిష్కరించాడు. కొందరు యూదులు అతనికి దడిసి