పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరుల జాబులు - 7

20. యాకోబు
21-22, పేతురు జాబులు రెండు
23–25. యోహాను జాబులు మూడు
26. యూదా

4. దర్శన గ్రంథం = 1

27. దర్శనగ్రంథం (ప్రకటన గ్రంథం)

మన క్యాతలిక్ లెక్కప్రకారం బైబులు గ్రంథాలు 73. కాని ప్రోటస్టెంటు శాఖలవాళ్ళఅభిప్రాయంప్రకారం ఈ 73లో 7 పుస్తకాలు భగవత్సేరితాలు కావు. కల్పితాలు. ఈ యేడు పూర్వవేదంలోనివే. వీళ్ళ లెక్కప్రకారం బైబులు పుస్తకాలు 66 మాత్రమే. వీళ్ళు అంగీకరించని 7 పుస్తకాలు ఇవి. 1. సాలోమోను జ్ఞానగ్రంథం. 2. సీరా జ్ఞానగ్రంథం, 3. యూదితు, 4. తోబీతు, 5. బారూకు, 6–7. మక్కబీయుల గ్రంథాలు రెండు. ఈ యేడింటినీ వీళ్ళు “అపోక్రిఫా? అనే పేరుతో ప్రత్యేక గ్రంథంగా ముద్రిస్తారు. కల్పిత గ్రంధాలని ఈ పేరుకి అర్థం.

2. పూర్వ వేదం గ్రంథాలు

పూర్వాధ్యాయంలో బైబులు పుస్తకాలనూ వాటి విభజననూ పేర్కొన్నాం. ఇక ఒక్కో పుస్తకంలోని విషయాన్ని సంగ్రహంగా పరిశీలిద్దాం. మొదట పూర్వవేదంతోను, అందులోను ఆదిపంచకంతోను ప్రారంభిద్దాం.

1. ఆదిపంచకం

ఇప్పడు మనం తొలి ఐదు పుస్తకాలుగా గణించే ఆది, నిర్గమ, පීඩීරරා, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండలనే పుస్తకాలు తొలుత ఏకగ్రంథంగానే వుండేవి. కథావస్తువునుబట్టి వాటిని క్రమేణ ఐదుగ్రంధాలుగా విభజించారు. కనుక ఇవి కాలక్రమేణ పరిణామం చెందాయి. చాలమంది రచయితలు చాలకాలాల్లో వీటి రచనా వ్యాసంగంలో పాల్గొన్నారు. కనుక ఈ గ్రంధాల్లో పునరుక్తులూ, కొన్నిచోట్ల పరస్పర విరుద్ధవాక్యాలు కూడ తగులుతాయి. అంతమాత్రంచేత వీటి విలువయేమీ తగ్గదు.

ఆదిపంచకంలోని ముఖ్యాంశం యూదులు ఫరోదాస్యం నుండి విముక్తిపొంది ఐగుప్తనుండి తరలిరావడం, మోషే నాయకత్వాన సీనాయి కొండ దగ్గిర యావే ప్రభువుతో