పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిబంధనం చేసికోవడం. ఈ గ్రంథాల్లో ప్రముఖంగా కన్పించే నాయకుడు మోషే కనుక ప్రాచీనులు అతడే వీటిని వ్రాసాడని భావిస్తూ వచ్చారు. కాని ఆధునికుల భావాల ప్రకారం మోషే స్వయంగా వీటిని వ్రాయలేదు. అతని మరణానంతరం చాల యేండ్లకుగాని ఈ పుస్తకాలు పుట్టలేదు. కాని వీటిలోని భావాలు ప్రధానంగా మోషేవే. కనుక ఇవి అతని పేరు మీదుగా చలామణి ఔతూ వచ్చాయి. యూదులు ఈ యాదిపంచకాన్నే ధర్మశాస్త్రం లేదా ఉపదేశం అని పిలుస్తారు. వాళ్ళ దృష్టిలో ఇవి పూర్వవేదంలోకల్లా ముఖ్యమైనవీ, పరమపవిత్రమైనవీని. ఇక ఈ యాదిపంచకంలోని ఒక్కో గ్రంథాన్ని పరిశీలిద్దాం.

ఆదికాండం

ఆదికాండం సృష్ణ్యాదిని గురించీ, నరజాతి ప్రారంభాన్ని గురించీ, యిస్రాయేలు పుట్టుకను గురించీ చెప్తుంది. కనుకనే దీన్ని ఆదికాండం అన్నారు. ఈ గ్రంథంలో తొలి 11 అధ్యాయాలూ ఆదిదంపతుల సృష్టి వాళ్ళ పతనమూ మొదలైన అంశాలను వర్ణిస్తాయి. 12-50 అధ్యాయాలు పితరులైన అబ్రాహాము, ఈసాకు, యాకోబు, యోసేపు మొదలైనవాళ్ళ చరిత్రలను వర్ణిస్తాయి. అబ్రాహాము విశ్వాసంద్వారా దేవునికి ప్రీతిపాత్రుడయ్యాడు. యిప్రాయేలు ప్రజలందరికీ తండ్రి అయ్యాడు. యోసేపు దైవబలంవలన మహాజ్ఞానియై విజయాలు సాధించాడు. ఈ తొలిపుస్తకం బైబులు అంతటికీ పునాదిలాంటిది. ఈ గ్రంథంలో వచ్చే కథలుకూడ చాల ఆకర్షణీయంగా వుంటాయి. ఈ పుస్తకం క్రీస్తుపూర్వం 1800-1500 సంవత్సరాల్లో జరిగిన చరిత్రను చెప్తుంది.

నిర్గమ కాండం

నిర్గమం అంటే బయటికి వెళ్ళడం. యిప్రాయేలీయులు ఫరో దాస్యాన్నుండి తప్పించుకొని ఐగుప్తనుండి బయటికి వెళ్ళారు. ఎడారిలో కొన్నాళ్ళ ప్రయాణంచేసి సీనాయి కొండదగ్గర మోషే నాయకత్వాన యావే ప్రభువుతో నిబంధనం చేసికొన్నారు. ఈ సమయంలోనే దేవుడు ఆ ప్రజలకు ధర్మశాస్త్రం దయచేసాడు. ఈ నిబంధనమూ ధర్మశాస్త్రమూ క్రీస్తు వచ్చిందాకా చెల్లాయి. పూర్వవేదమంతా ఈ రెండంశాలమీదనే ఆధారపడి వుంటుంది. కనుక ఇది అతి ముఖ్యమైన పుస్తకం. ఈ గ్రంథం 13వ శతాబ్దంలో జరిగిన కథ చెప్పంది. ఈ రెండవ గ్రంథంనుండి ఐదవ గ్రంథంవరకు యూదుల చరిత్రలో మోషే ప్రముఖ వ్యక్తిగా కన్పిస్తాడు.

లేవీయకాండం

లేవీయులంటే యాజకులు, యాజకులు ఆరాధనలో పాటించవలసిన నియమాలను చెప్పేదే లేవీయకాండం. ఈ పుస్తకం యిస్రాయేలీయులు బాబిలోనియా ప్రవాసంనుండి