పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3,15-16. చెప్పలు విప్పడం దాసులు చేసేపని. ఆ పనికికూడ నేను తగనని తన్నతాను తగ్గించుకొన్నాడు.

క్రీస్తు రాగానే యోహాను అతన్ని తన శిష్యులకు చూపించాడు. అదిగో ! లోకం పాపాలను పరిహరించే గొర్రెపిల్ల అని క్రీస్తుని శిష్యులకు పరిచయం చేసాడు - యోహా 1, 29. కాని క్రీస్తు లోకం పాపాలను ఏలా పరిహారిస్తాడో యోహానుకి స్పష్టంగా తెలియదు. అసలు క్రీస్తు తననుండి ఎందుకు జ్ఞానస్నానం పొందుతున్నాడోగూడ యోహానుకి సరిగా తెలియదు - మత్త 3, 13-15. ప్రజల పాపాలను పరిహరించడానికి క్రీస్తు మొదట సిలువ జ్ఞానస్నానాన్ని పొందాలి. సిలువ మరణం ద్వారాగాని అతడు ప్రజల పాపాలను తొలగించలేడు- లూకా 12,50. ఆ సిలువ జ్ఞానస్నానానికి ఈ యోహాను జ్ఞానస్నానం నాంది. ఆ సిలువ జ్ఞానస్నానం ద్వారానే అతడు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చేది - మత్త 3, 15, అతని ಯೌಠ್ಠನಿು జ్ఞానస్నానం సిలువ జ్ఞానస్నానం గూడ తండ్రి ముందుగా నిర్ణయించినవే. అవి అతని రక్షణ ప్రణాళికలో వివిధ ఘట్టాలు. ఈ ఘట్టాల ద్వారానే క్రీస్తు ప్రజల పాపాలకు మన్నింపు సంపాదించి పెడతాడు.

యోహాను చెరలో వుండగా అతనికి క్రీస్తునిగూర్చి అనుమానం కలిగింది. ఆనాటి యూదులు మెస్సీయా రాజుగా వస్తాడనుకొన్నారు. రోమను ప్రభుత్వాన్ని కూలద్రోసి యూదయాకు రాజకీయ స్వాతంత్ర్యం తెచ్చిపెడతాడనుకొన్నారు. కాని క్రీస్తు ఈ పనేమి చేయడంలేదు. అతడు నిరాడంబరంగా, వినయంగా, ఈలోక సంబంధమైన బలం ఏ మాత్రం లేనివాడుగా కన్పించాడు. కనుక ఇతడు మెస్సీయా యేనా అని చాలమందితోపాటు యోహానుకూడ శంకించాడు. అతని వద్దకు ఇద్దరు శిష్యులను పంపి రాబోయేవాడివి నీవా లేక మేము మరొకరి కొరకు ఎదురుచూడాలా అని అడిగించాడు. క్రీస్తు తాను చేసే అద్భుతాలను ఆ శిష్యులకు వివరించి చెప్పాడు. తన్ను గూర్చి శంకించవద్దని వారిని హెచ్చరించాడు. మెస్సియా కాలంలో ఈలాంటి అద్భుతాలు జరుగుతాయని పూర్వం ప్రవక్తలు చెప్పారు. కనుక యోహాను వాటిని చూచి రాబోయేవాడు ఈ క్రీస్తేనని నమ్మవచ్చు. నమ్మి ప్రశాంతంగా కన్నుమూయవచ్చు. క్రీస్తు మెస్సీయా కాకపోతే యోహాను మార్గం సిద్ధం జేయడానికి పడిన శ్రమంతా నిప్రయోజన మౌతుంది. కారాగార శిక్ష వ్యర్థమౌతుంది. ఇప్పడు క్రీస్తే మెస్సీయా అని నమ్మి అతడు ప్రశాంతంగా కన్నుమూయవచ్చు - మత్త 11,2-6.

3. పెండ్లికుమారునికి మిత్రుడు

యోహాను శిష్యుల్లో కొందరు క్రీస్తుని అనుసరించారు. కొందరు అనుసరించలేదు. వీళ్ళకీ క్రీస్తుశిష్యులకీ తర్వాత ఘర్షణలు జరిగాయి. యోహాను శిష్యుల్లాగ క్రీస్తు శిష్యులు ఉపవాసం చేయరేం అనే ప్రశ్న వచ్చింది -మార్కు 2,18. దీన్ని బట్టి ఈలాంటి ఘర్షణలు ఉన్నాయనుకోవాలి. యోహాను గొప్పా క్రీస్తు గొప్పా అనే ప్రశ్నయెదురైనప్పడల్లా ఆదిమ క్రైస్తవ సమాజం యోహాను వాక్యాలనే ఉదాహరించేది. "నా తర్వాత వచ్చే వ్యక్తి నాకంటె 232