పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్లారు కనుక వాళ్లు తెచ్చిన నీరు వారి నెత్తురుతో సమానమన్నాడు. ఆలాంటి నీటిని తాను ముట్టనన్నాడు. దావీదుకి తన అనుచరులపట్ల అంత ఆదరం, అంత గౌరవభావం, నేడు మనతో కలసి పనిచేసేవారిపట్ల మనకు ఎంత గౌరవముంటుంది? - 2 సమూ 23, 13-17.

3.దావీదు ఓసారి ఆమాలెకీయులతో యుద్ధం జేసాడు. అలసిపోయిన అతని సైనికులు కొందరు ఆ పోరాటంలో పాల్గొనలేకపోయారు. యుద్ధంలో దావీదు గెల్చి అమాలెకీయులను దోచుకొన్నాడు. కాని పోరాడిన సైనికులు పోరాడని సైనికులకు కొల్లగొట్టిన సొమ్మును పంచిపెట్టడానికి నిరాకరించారు. అప్పడు దావీదు జోక్యంజేసికొని పోరాడని బంటులకు గూడ భాగం ఇప్పించాడు. అతడు అంత ఉదారబుద్ధి కలవాడు - 1సమూ 30,21=25.

4.అబ్పాలోముకి భయపడి యెరూషలేము నుండి పారిపోయిన దావీదు, అతన్ని ఓడించి మళ్లా నగరానికి తిరిగివసూన్నాడు. దారిలో యోర్గాను నదివద్ద షిమీ అతన్నికలసికొన్నాడు. ఇతడు దావీదుకి శత్రువు. ఆరాజు నగరాన్ని వీడిపోయేపుడు అతన్ని శపించి అతనిపై దుమ్మెత్తిపోసాడు. అలాంటివాడు ఇప్పడు దావీదు కాళ్ళమీదపడి తన తప్పను మన్నించమని వేడుకొన్నాడు. దావీదు మనసు కరిగి నేను నిన్ను చంపను అని ప్రమాణం చేసాడు. అతని క్షమాగుణం అంత గొప్పది. మనం అపరాధులను మన్నిస్తూంటామా? 2సమూ 19, 16-24.

9. స్నాపక యోహాను

యోహాను మహాప్రవక్త, క్రీస్తుకి సాక్షి. అతనికి ముందుగావచ్చి మార్గాన్ని సిద్ధంచేసినవాడు. దైవరాజ్యబోధ అతనితో ప్రారంభమైంది. యోహాను కాలంవరకు మోషే ధర్మశాస్త్రం ప్రవక్తలబోధలు ఆచరణలోవున్నాయి. కాని అతని కాలం నుండి దైవరాజ్యబోధ ప్రరంభమైంది — లూకా 16, 16.

1. ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసినవాడు

యోహాను పుట్టక పూర్వమే దేవునికి సమర్పితుడై పవిత్రాత్మతో నిండివున్నాడు లూకా 1.15. పూర్వం సంసోనులాగ అతడుకూడ ప్రభువుకి అంకితుడై ద్రాక్షాసవం మద్యం మొదలైనవాటిని ముట్టలేదు. న్యాయాది - 13,5-6. అతడు బాల్యంనుండి యెడారిలోనే జీవితం గడిపాడు - లూకా 1,80. పూర్వం యేలీయాలాగ భక్రా గ్రేసరుల దుస్తులు ధరించాడు - 2 రాజు 1,8. ఒంటె రోమాల కంబళి ధరించి నడుముకి తోలుపట్టీనికట్టి మిడతలను భుజించి పుట్టతేనెను త్రాగాడు - మత్త 3,4 ఆరోజుల్లో ఎస్పీనులనబడే యూదభక్తులు కుమ్రాను ఎడారిలో తపోజీవితం గడిపేవాళ్లు, యోహాను కూడ కొంతకాలం వాళ్లతో జీవించి వుండవచ్చు. 230