పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కట్టిపెట్టే దేవాలయం అతని రాజవంశమే. దేవుడు దావీదు రాజవంశం అవిచ్ఛన్నంగా కొనసాగేలా చేస్తాడు. ఈ వంశంనుండే తర్వాత మెస్సీయా ఉద్భవిస్తాడు. ఇది చాల గొప్ప వాగ్దానం, గొప్ప నిబంధనం. ప్రభువు పూర్వం సీనాయి దగ్గరయిస్రాయేలీయులందరితోను చేసికొనిన నిబంధనం ఇప్పడు ఈ దావీదు రాజుతో చేసికొనిన నిబంధనంలో కలిసిపోయింది. అనగా అతడు యూదులందరితోను చేసికొన్న నిబంధనం ఇప్పడు దావీదు కుటుంబానికి పరిమితమైపోయింది. ఇకమీదట ప్రభువు దావీదు వంశజులైన రాజులద్వారాగాని యిస్రాయేలీయులను రక్షించడు. ఈ రక్షణం మెస్సీయా రాకడతో పరిపూర్ణమౌతుంది. ఈ వాగ్దానం ప్రకారం దావీదుకీ అతని వంశజులైన రాజులకీ ఎంతో విలువ వచ్చింది. వాళ్ళంతా రాబోయే మెస్సీయాను సూచించేవాళ్ళయ్యారు. ప్రభువు చాలసార్లు దావీదు వంశజుడైన రాజు ద్వారా నేను మిమ్మరక్షిస్తానని యిప్రాయేలీయులకు మాటయిస్తూ వచ్చాడు - యెహె 35, 23-24.

క్రీస్తుపూర్వం 587లో దావీదు రాజవంశం అంతరించింది. బాబిలోనియారాజు నెబుకద్నెనరు యెరూషలేమును నాశంజేసి యూదులను బాబిలోనియాకు బందీలనుగా తీసికొనిపోయాడు. కాని దావీదు వంశపు రాజులు అంతరించినా అతని వంశం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఆ వంశం నుండి పుట్టినవాడే యోసేపు. అతని పెంపుడు కొడుకే యేసు-మత్త 1, 16:20, కనుక యేసుకి "దావీదు కుమారుడు" అని పేరు వచ్చింది- మత్త 1,1. ఈ యేసు పూర్వం ప్రభువు దావీదుకి చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి వచ్చాడు. కనుక అతడు దావీదుకంటె అధికుడు. దావీదుకి ప్రభువు - మత్త 22,44- 45.అతడు దావీదులాగ ప్రజలకు కేవలం నాయకుడు మాత్రమే కాదు. వారికి దేవుడు కూడ. దావీదు వేరునుండి చిగురులాగ పుట్టుకవచ్చిన ఈ యేసు త్వరలో తిరిగి రావాలని ఆత్మా వధువైన తిరుసభ నిరంతరం ప్రార్ధిస్తుంటారు - దర్శ 22, 16-17.

ప్రార్థనా భావాలు

1. దావీదు మహాభక్తుడు. మందసాన్నియెరూషలేమకి తీసికొని వచ్చినపుడు అతడు యాజక వస్త్రలు ధరించి తన్మయత్వంతో దానిముందు నాట్యం చేసాడు. దానిముందు బలులర్పించాడు. ప్రజలకు ప్రసాదం పంచిపెట్టాడు. అతని భక్తి మనకుకూడ అలవడితే ఎంత బాగుంటుంది! - 2 సమూ 6, 13-19. 2. దావీదుకీ ఫిలిస్టీయులకీ యుద్ధం జరుగుతుంది. అతనికి బేల్లెహేము బావి నీళ్ళంటే యిష్టం, కాని ఫిలిస్ట్రీయులు ఆ నగరాన్ని చుట్టుముట్టివున్నారు. ఐనా దావీదు వీరులు ముగ్గురు శత్రువులకు భయపడకుండ అతిసాహసంతో ఆ బావికి వెళ్లి నీళ్లు తీసికొనివచ్చి దావీదుకిచ్చారు. కాని అతడు ఆ నీళ్లు ముట్టుకోలేదు. వాటిని ప్రభువుకే ధారపోసాడు. ఆ వీరులు తమ ప్రాణాలకు కూడ తెగించి బేత్లేహేము229