పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయునుగాక. నేను అతనిచేతిలోని వాడను" అనుకొన్నాడు - 2నమూ 15,26. యెరూషలేమునుండి పారిపోయేప్పుడు తన శత్రువైన షిమీ తిట్టిన తిట్లను దేవుడు దీవెనలుగా మార్చుతాడనుకొన్నాడు – 16, 12. ప్రభువుపట్ల అతనికున్న విశ్వాసం అంత గొప్పది. මහණ්ඨ కృతజ్ఞతాభావంతో ప్రభువు తనకు దయచేసిన ఉపకారాలకు వందనాలు చెప్పకొనేవాడు -2సమూ 7, 18-29. పూర్వవేదంలో "దీనులు" అనే భక్తవర్గం వుండేది. వాళ్ళు ప్రభువుని నమ్మి అతనిమీదనే ఆధారపడిజీవిస్తూ నిరంతరం అతనికి వందనాలు అర్పించేవాళ్ళ దావీదు ఈ భక్తులకు ప్రతినిధి. అతడు దైవపరికరాల సహాయంతో ముఖ్యమైన సంఘటనలన్నిటిలోను ప్రభువు చిత్తాన్ని తెలిసికొంటూంటేవాడు -1సమూ 23, 9.30,7.

ఆ రాజు మహాభక్తుడు, దేవునిమీద చాల పాటలు వ్రాసాడు. స్వయంగా వాద్యం మీటుతూ పాటలు పాడేవాడు. దేవాలయం నమూనాను సిద్ధంచేసినవాడతడే. ప్రభువుని ఆరాధించే సంప్రదాయాన్ని నెలకొల్చినవాడతడే. దేవాలయంలో ప్రభుని స్తుతించి పాటలు పాడటానికి లేవీయులను నియమంచినవా డతడే.

దావీదులో లోపాలుకూడ వున్నాయి. అతడు జిత్తుల మారి -1నమూ 27, 10 - 12. కొన్నాళ్ళు బందిపోటు దొంగలకు నాయకుడుగాగూడ వ్యవహరించాడు - 27, 8-12 అతడు ఫిలిస్ట్రీయులరాజు ఆకీషుతో ఓ సంవత్సరం గడిపినా ఆ రాజు తన మోసాలను గుర్తించకుండా వుండేలా నడచుకోగలిగాడు -29, 6–7. దావీదు తన శత్రువులమీద పగతీర్చుకోనని మాటయిచ్చాడు, కాని చనిపోతూ శత్రువులైన యోవాబు, షిమీ మొదలైన వారిపై పగతీర్చుకొమ్మని తన కుమారుడు సొలోమోనును ఆదేశించాడు - 1 రాజు 2, 59. అతడు తన కుమారులను అదుపులో పెట్టుకోలేకపోయాడు. వాళ్ళు చాల దుండగాలు చేసారు. ఇక, బత్తెబా ఉదంతం అతనికి మాయనిమచ్చగా వుండిపోయింది - 2 సమూ 11.

ఈలాంటి లోపాలున్నా దావీదు మహానుభావుడు కూడ. యోనాతానుపట్ల అతడు చూపిన స్నేహం బైబుల్లోనే ప్రసిద్ధమైంది. జీవితాంతం అతడు సౌలుకి నమ్మినబంటుగా వుండిపోయాడు. సౌలు అతనికి ద్రోహం తలపెట్టినా అతడు సౌలుకి ద్రోహం చేయలేదు. దైవమందసంపట్ల అతడు చూపిన భక్తి అపారమైనది. దావీదు గొప్ప యుద్ధవీరుడు, రాజకీయతంత్ర నిపుణుడు. ఆ రోజుల్లో యిప్రాయేలీయులకు కావలసిన నాయకుడు ప్రధానంగా ఆలాంటివాడే సంగ్రహంగా చెప్పాలంటే అతడు ప్రభువు హృదయానికి నచ్చినవాడు - 1 సమూ 13,14.

3. మెస్సియా దావీదు కుమారుడు

దావీదు ప్రభువుకి దేవాలయం కట్టబోయాడు. కాని ప్రభువు అతన్ని వారించి “నీ కుమారుడు సాలోమోను నాకు దేవళం కడతాడు. నీవు కట్టనక్కరలేదు. కాని నీవు నాకు మందిరం కట్టాలని మంచికోరిక కోరుకొన్నావు. కనుక నేను నిన్ను బహూకరిస్తాను. నేను నీ కొక మందిరం కట్టిపెడతాను" అన్నాడు– 2 సమూ 7,11. ప్రభువు దావీదుకి 228