పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8.దావీదు

దావీదు తన వంశంలో పుట్టబోయే మెస్సీయాకు సూచనంగా వుంటాడు. దావీదు కాలంనుండి, ప్రభువు యిస్రాయేలీయులతో నిబంధనం చేసికోవడమంటే ఒక్క దావీదు రాజుతో నిబంధనం చేసికోవడమే ఐంది. కనుకనే పూర్వవేదం చివరి కాలంలో వచ్చిన సీరా

ప్రభువు దావీదుతో రాజ్యసంబంధమైన నిబంధనం చేసికొని
అతని రాజ్యం నిత్యవైభవంగా కొనసాగేలా చేసాడు

అని వాకొన్నాడు - సీరా 47,11. యిస్రాయేలు సింహాసన మంటే దావీదు సింహాసనమే. దావీదు విజయాలు మెస్సీయా విజయాలకు సూచనలయ్యాయి. మెస్సీయా తన తరపున తాను ఉత్తానమై లేచి దేవుడు దావీదుకి చేసిన ప్రమాణాలన్నీ నెరవేర్చాడు - అ,చ. 13,34. ఇక, దావీదు ఇంత గొప్పవాడు ఏలాగయ్యాడో పరిశీలిద్దాం.

1. ప్రభువు ఎన్నుకొనిన రాజు

దేవుడు గొర్రెలను కాచుకొనే దావీదును పిలిపించి అతనికి అభిషేకం చేయించాడు –1సమూ 16,11-13. ఆ మీదట అతనికి తోడైయుండి అతని కార్యాలన్నిటినీ విజయవంతం చేసాడు. అతనికి గొల్యాతుమీద విజయం ప్రసాదించాడు -1సమూ 17, 45-47. సౌలు కొలువులో వున్నపుడు అతడు చేసిన యుద్దాల్లో గెల్పు దయచేసాడు - 18, 12-14 దావీదు పోరాడిన చోట్లన్నిటిలోను యావే అతనికి విజయాన్ని దయచేసాడు - 2 సమూ8,14

మోషేలాగే దావీదుకూడ యిస్రాయేలీయులకు కాపరి, నాయకుడు. పూర్వం ప్రభువు పితరులకు చేసిన వాగ్గానం దావీదుకిగూడ చేసాడు. ఈ వాగ్హానం ప్రకారం అతడు కనాను దేశాన్ని స్వాధీనం చేసికొన్నాడు. అతడు పూర్వం సౌలు కొలువులో వున్నపుడే ఫిలిస్ట్రీయులతో యుద్దాలు మొదలుపెట్టాడు. తర్వాత తాను రాజయ్యాక వాటిని ఉధృతంజేసి ఫిలిస్ట్రీయులను గెల్చి కనానును వశంజేసికొన్నాడు. దావీదు యెరూషలేమును జయించడంతో ఈ కనాను గెల్పు పూర్తయింది -2 సమూ 5,6-10. ఈ పట్టణానికి అతడు దావీదు నగరమని పేరు పెట్టాడు. ఆ నగరాన్ని తన రాజ్యాని కంతటికీ రాజధానిని చేసాడు. ఆ నగరంలోనే అతడు దైవమందసానికి నివాసం కల్పించాడు. కనుక అన్ని తెగల యిప్రాయేలీయులూ అక్కట్టే దేవుణ్ణి కొల్వడానికి ప్రోగయ్యారు-2 సమూ 6,1-19. సౌలు కాలంలో ఐక్యంగాని 12 తెగలూ దావీదు కాలంలో ఐక్యమయ్యాయి. ఇది చాల గొప్ప విజయం.

2. యిప్రాయేలు వీరుడు

దావీదు ప్రభువు చెప్పినట్లుగా నడచుకొన్న భక్తుడు. దేవుని ఆజ్ఞమీరి అతడు ఏమీచేయలేదు, కనుకనే శత్రువైన సౌలు ఓమారు కొండగుహలోను, మరోమారు రాత్రి శిబిరంలోను తనకు దొరికిపోయినా దావీదు అతన్ని చంపలేదు - 1 నమూ 24,26. ఎందుకంటే అది దైవచిత్తంకాదు. బాధల్లోగూడ అతడు “యావే నన్ను తన యిష్టం వచ్చినట్లు 227