పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. స్నాపక యోహాను ఏలీయా

లోకాంతంలో తిరిగివచ్చే యేలీయా స్నాపక యోహానే అనే భావం నూత్న వేదంలో కన్పిస్తుంది. యూదులు ఏలీయా తిరిగివచ్చి ఓ దేవదూతలా తమ్ము కాపాడతాడను కొన్నారు - మార్కు 15, 35-36. క్రీస్తు కూడ యోహానే యేలీయా అని శిష్యులతో చెప్పాడు - మత్త 17,10–13. కాని స్నాపక యోహాను మాత్రం నేను యేలీయాని కాదని వాకొన్నాడు - యోహా 1, 21. యోహాను కొంత వరకు ఏలీయాకు పోలికగా వుంటాడు. ఏలీయాలాగే యితడు కూడ తండ్రులను కుమారులను ఏకం చేస్తాడు - లూకా 1,17. స్నాపక యోహాను ఒంటెరోమాల కంబళి ధరించి నడుముకి తోలుపట్టీ కట్టి మిడతలను భుజించి పుట్ట తేనెను త్రాగినవాడు - మత్త 3,4. ఇది అతని యెడారి జీవితం, కాని పూర్వం యేలీయా జీవితంగూడ అచ్చంగా యిూలాంటిదే - 2రాజు 1,8. ఈలా కొన్ని విషయాల్లో ఈ యిద్దరికి సామ్యం వుంది. కనుక యోహాను కొంతవరకు ఏలీయాకు ప్రతిబింబం.

7. క్రీస్తూ ఏలీయా

ఐతే యేలీయాకు పూర్తి ప్రతిబింబం క్రీస్తు. అతడు నజరేతు ప్రార్థనామందిరంలో బోధించినప్పడే తన్ను యేలీయాతో పోల్చుకొన్నాడు. ఆ ప్రవక్త లాగే నేనూ అందరివద్దకు పంపబడ్డానని చెప్పకొన్నాడు — లూకా 4, 25-26. ఏలీయా సారెఫతు విధవాపుత్రుని జీవంతో లేపాడు - 1 రాజు 17, 17-24. ఆలాగే క్రీస్తూ నాయీను వితంతువు కుమారుని జీవంతో లేపాడు - లూకా 7,11-16. ఏలీయా ఆకాశం నుండి నిప్పను కురిపించి ద్రోహులను శిక్షించాడు -2రాజు 1,10. క్రీస్తుకూడ పవిత్రాత్మ అనే నిప్పని ప్రజలమీదికి తీసికొని వచ్చాడు - లూకా 12, 49. ఏలియాను ఎడారిలో దేవదూత ఓదార్చాడు-1 రాజు 19, 5. ఆలాగే క్రీస్తునికూడగెత్సెమని తోపులో దేవదూత ఓదార్చాడు-లూకా 22,43. ఏలీయ మోక్షానికి వెళ్ళేపుడు అతని ఆత్మ యెలీషా మీదికి దిగివచ్చింది-2 రాజు 2,9- 15. అలాగే వృత్తాన క్రీస్తు శిష్యులమీదికి ఆత్మను పంపాడు-లూకా 24,49-51. ఈ పోలికలనుబట్టి ఏలీయా లక్షణాలు క్రీస్తులో అధికంగా కన్పిస్తాయి. కనుక నూత్న వేదంలో క్రీస్తు యేలీయాకు ప్రతిబింబం. పూర్వవేద వ్యక్తులను ప్రస్తావించేపుడు నూత్న వేదం మోషే అబ్రాహాము దావీదుల తర్వాత యేలీయాను ఎక్కువగా పేర్కొంటుంది.

ప్రార్థనా భావాలు

1. ఏలీయాలోని ప్రధాన గుణం దైవభక్తి ఆ భక్తివల్లనే అతడు ఆనాటి భక్తిరహితులైన అహాబునీ అతని కుమారుడు అహస్యానీ ప్రతిఘటించాడు. దీనికి ఒక్క ఉదాహరణ చాలు. అహస్యా జబ్బుపడి ఫిలిస్టియుల దేవుడు బాల్సెబూబును సంప్రతించడానికి దూతల నంపాడు. తనకు ఆరోగ్యం చేకూరుతుందో లేదో తెలిసికొని రమ్మని వారిని ఆదేశించాడు. దారిలో ఏలీయా ఆ దూతలను కలసికొని "మీరు ఫిలిస్టీయుల దేవుణ్ణి సంప్రతించడం దేనికి? యిప్రాయేలు