పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



10. బాధామయ సేవకుడు

బైబులు భాష్యం-124

సేవకుడు

"సేవకుడు" అనే మాట బైబుల్లో చాలచోట్ల కన్పిస్తుంది. మోషే, యోషువా మొదలైన నాయకులు అబ్రాహాము, ఈసాకు, యాకోబు మొదలైన పితరులు సేవకులు, దావీదు, యోషీయా మొదలైన గొప్ప రాజులు, కడకు అన్యజాతి రాజులైన కోరెషు, నెబుకద్నెసరులాంటివాళ్లు కూడ సేవకులు. ఆమోసు, యెషయా, యిర్మీయా మొదలుగా గల ప్రవక్తలు, దేవదూతలు, యాజకులు, యిప్రాయేలు ప్రజలు కూడ సేవకులే. ఈ వర్గానికి చెందినవాడే బాధామయ సేవకుడు.

యిస్రాయేలు ప్రజలు ప్రభువు ఆజ్ఞలు మీరి ద్రోహులయ్యారు. కనుకనే “మీరు ప్రభువు ప్రజలైనప్పటినుండి తిరుగబడుతూనే వచ్చారు" అన్నాడు మోషే-ద్వితీ 9, 24 ప్రభువు ఆ ప్రజలపై కోపించి వారిని నెబుకద్నెసరు అనే బాబిలోనియా రాజు వశంజేసాడు. అతడు యెరూషలేమను ధ్వంసంచేసి 586లో యూదులను బాబిలోనియాకు బందీలనుగా కొనిపోయాడు. అప్పటినుండి 538లో పారశీకరాజు కోరెషు విడుదల దయచేసే వరకు యూదులు ప్రవాసంలోనే వున్నారు. ఈ ప్రవాసంలో భక్తిగలవాళ్ళు కొందరు మాత్రం యావేను విస్మరింపక చిత్తశుద్ధితో పూజిస్తూ వచ్చారు. వీరికే “శేషజనం" అని పేరు. ఈ వర్గానికి చెందినవాడే బాధామయ సేవకుడు. ఇతడు ప్రాణాలు కూడ అర్పించి ప్రభువుకీ అతని ప్రజలకూ సేవలు చేసిన భక్తుడు. యెషయా గ్రంథం నాలు గీతాల్లో ఇతన్ని స్తుతిస్తుంది. వీటికి "బాధామయ సేవకుని గీతాలు" అని పేరు. ఇవి యెషయా ప్రవచనం 42, 1-7. 49, 1-6. 50, 4-11, 52, 13-53, 12 వచనాల్లో వస్తాయి.

ముందే చెప్పినట్లు ఇవి బాబిలోనియా ప్రవాసం చివరి కాలానికి చెందినవి. ఇవి యూదులు ప్రవాసాన్ని ముగించుకొని యెరూషలేముకి తిరిగి రావడాన్ని ప్రస్తావిస్తాయి, వీటి రచయిత యెవరో మనకు తెలియదు. యెషయా ప్రవక్త శిష్యుడైన "రెండవ యెషయా" పేరు మీదిగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ గీతాలు నాలు బాధామయ సేవకుని భక్తిని వర్ణిస్తాయి. అతడు యూదులకు నిబంధనంగాను, అన్యజాతులకు వెలుగుగాను వుంటాడు. ప్రజల కొరకు బాధలు అనుభవించి చనిపోయి మళ్ళా ఉత్తానమౌతాడు. అతని మరణం ద్వారా యిస్రాయేలుకు పాపవిమోచనం సిద్ధిస్తుంది. ఈ గీతాలు పూర్వవేదంలోని ఉత్తమస్థాయి ప్రవచనాలకు చెందినవి. వీటి ఆధ్యాత్మికస్థాయి కూడ ఉన్నతమైందే. పైగా ఈ ప్రవచనాలు