పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



గ్రీకు, లాటిన్ పితృపాదులు ఈ గ్రంథాన్ని నిత్యం పఠించేవాళు, "ప్రభు దేహాన్నిమల్లె ప్రభు గ్రంథాన్ని కూడ శరణు పొందుతూన్నాను" అనేవారు ఆంటియోకయ ఇన్యాసివారు. "దివ్యగ్రంథం ఓ పొలంలాంటిది. ఈ බි"එරණි దాగివున్న నిధి క్రీస్తే బైబులు తెలియనివాళ్ళకు క్రీస్తంటే యేమిటో తెలీదు” అనేవారు జెరోముగారు. *పరలోకంలోని తండ్రి ప్రవాసంలోవున్న మనకు అనురాగంతో వ్రాసిన లేఖలు యూ దివ్యగ్రంథాలు" అనేవారు క్రిసొస్తంగారు. "తిరుసభ అనే కన్యకు అర్పింపబడిన వరకట్నం దివ్యగ్రంథం" అనేవారు గ్రెగోరీగారు. "సువార్త క్రీస్తు కంఠం" అనేవారు అగస్టినుగారు. ఈలా తొలిరోజులలోనుండి క్రైస్తవ ప్రజలు శ్రద్ధతో పఠిస్తూవచ్చిన యీ గ్రంథాన్ని మనంగూడ ఆదరంతో చదువుతూండాలి.

2. భగవత్సేరితాలు :

అన్నిపుస్తకాలు మనుష్యులు వ్రాసారు. కాని ఈ బైబులుగ్రంథాన్నిదేవుడే వ్రాసాడు. కలాన్ని సాధనంగా వాడుకొని జాబు వ్రాస్తుంటాం. ఇదేవిధంగా భగవంతుడుగూడ నరుణ్ణి సాధనంగా వాడుకొని ఈ గ్రంధాలు వ్రాసాడు. దేవుని పరిశుద్ధాత్మకొందరు రచయితలను ప్రేరేపించి యీ గ్రంథాలను వ్రాయించింది (2 పేత్రు 1:21). దివ్యగ్రంథానికున్న విలువంతా గూడ యిూ భగవత్ఫేరణం అనే అంశంమీదనే ఆధారపడి వుంటుంది. ఈ విషయం మీదట స్పష్టమౌతుంది.

8. మరో మనుష్యావతారం :

దివ్యగ్రంథం మరో మనుష్యావతారం లాంటిది. అక్కడ క్రీస్తు మానుష దేహంలో దైవ సాన్నిధ్యం వుంది. ఇక్కడ యీ గ్రంథంలోను దైవ సాన్నిధ్యం నెలకొనివుంది. అక్కడ వరో దేహం దేవుణ్ణి కప్పివేసింది. ఇక్కడ ముద్రాక్షరాలు దేవుణ్ణి కప్పివేసాయి. దైవ వాక్కే క్రీస్తు, దైవవాక్కేదివ్యగ్రంథం కూడాను. వాక్కుదేహం ధరించి మన మధ్యలో నివసించింది (యోహా, 1:14). పవిత్రాత్మ సహకారంవల్ల దైవవాక్కు కన్యగర్భంలో మానుషరూపం దాల్చింది. మళ్ళా ෂධී పవిత్రాత్మ సహకారంవల్ల దైవవాక్కు రచయితల ఉదరంలో మస్తిష్మంలో రూపందాల్చి దివ్యగ్రంథమై వెలువడింది

.

4. క్రీస్తును ముఖాముఖి కలుసుకుంటాం

 :

నాటి పాలస్తీనా దేశంలోని స్త్రీపురుషులు క్రీస్తును కలసికున్నారు. మరియా మార్తలు చనిపోయిన తమ్మునికోసం, కుష్టరోగులు రోగనివారణకోసం, శతాధిపతి సేవకునికోసం, కననీయ స్త్రీ కొమార్తెకోసం ప్రభువును సమీపించారని వింటున్నాం. ప్రభువు వాళ్ళకు మేలికార్యాలు చేసాడు. వారి బాధలను తీర్చాడు. కాని ప్రభువు నేడు