పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భౌతికంగా యీ మంటిమీద లేడు. మరి క్రీస్తు నెక్కడ కలసికుంటాం? ఈ దివ్యగ్రంథంలోను, క్రైస్తవ సంస్కారాల్లోను (దేవద్రవ్యానుమానాలు). ఈ గ్రంథంద్వారా ప్రభువు నాటి పాలస్తీనాలోని స్త్రీ పురుషులకుమల్లె నేడు మనకూ సాక్షాత్కరిస్తాడు. మనకూ మేలికార్యాలు చేసాడు.

5. ప్రభుజీవితం పొడిగింపబడుతూంది :

దివ్యారాధనంలో యీ గ్రంథాన్ని చదువుతూంటాం. దినదినం పూజలో ప్రభుబోధలు, సామెతలు, అద్భుతాలు చదువుతూంటాం. క్రిస్మసు పాస్క మొదలైన పండుగ దినాల పూజల్లో ప్రభుజీవిత ఘట్టాలు చదువుతూంటాం. ఈ విధంగా దివ్యారాధనలో చదివే బైబులు భాగాలద్వారా క్రీస్తుజీవితం మనమధ్యలో పొడిగింపబడుతూంది. ఈ గ్రంథం ద్వారా పీఠంమీదనుండి ప్రభువు మల్లా మనతో మాటలాడుతాడు, మనకు బోధిస్తుంటాడు. మనకు మేలికార్యాలు చేసూపోతాడు. ఈవిధంగా దివ్యారాధనం ప్రభుజీవితాన్ని మనమధ్యలో కొనసాగిస్తుంది.

6. ఓ సంస్కారం

దివ్యగ్రంథం ఓ సంస్కారం. ఏడు సంస్కారాల్లో ఒకటి కాదుగాని వాటివల ఫలవంతమైంది. అందుకే పితృపాదులు దీన్ని సత్రసాదంతో పోల్చారు. “మనం క్రీస్తు శరీరం భుజించి క్రీస్తురక్తం పానం జేసేది దివ్య సత్రసాదంద్వారా మాత్రమేగాదు, దివ్యగ్రంథ పఠనంద్వారా గూడ" అనేవాళ్లు జెరోముగారు. "దివ్యగ్రంథమనే పాత్రం నుండి క్రీస్తును పానంచేస్తున్నాం" అనేవాళ్ళు అంబ్రోసుగారు. "దివ్యభోజనం స్వీకరించినప్పళ్లాగే దివ్యగ్రంథం పఠించినప్పడు గూడ పిశాచాలు భయంతో మన చెంతనుండి పారిపోతాయి" అనేవాళ్లు అతనేష్యస్గారు. క్రీస్త్వనుసరణ గ్రంథం వ్రాసిన టోమస్ ఆకెంపిస్ భావాలప్రకారం, మన దేవాలయంలో రెండు వేదికలుంటాయి. ఓదానిపై సత్రసాదముంటుంది, మరోదానిపై සිංහළුනටඩ්හටයි. సత్రసాదం భోజనం. ఈ భోజనాన్ని భుజించి జీవిస్తాం. బైబులు వెలుగు. ఈ వెలుగులో సురక్షితంగా నడుస్తాం. మనకు భోజనం ఎంత అవసరమో వెలుగుకూడ అంత అవసరం (4,11,4). సత్ర్పసాదానికిముందు 'శిరమును వంచుడి” అంటూ భక్తిని ప్రదర్శిస్తూ మోకరిల్లుతాం. ఇదే భక్తిఆరాధనలు దివ్యగ్రంథంపట్ల గూడ ప్రదర్శించాలి. అక్కడిలాగే యిక్కడకూడ దైవసాన్నిధ్యం వుంది అన్నాం.

యధార్థ క్రైస్తవుడు దివ్యసత్రసాదాన్ని సేవించకముందు దివ్యవార్తను సేవించాలి. ఇది దానికి తయారుచేస్తుంది. అంచేత పూజబలికి ముందు కొంతకాలం బైబులు పఠించి