పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. చావుకిగాదు జీవానికి. కొందరికి బైబులులో మిడిమిడి జ్ఞానం వుంటుంది. వాళ్లు ఏవేవో పదాలనూ వాక్యాలనూ సాగదీసి వాటికి విపరీతార్ధం చెపూంటారు. ఈలాంటి వాళ్ళు బైబులుని లోతుగా అర్థం చేసికోలేరు. రచయిత హృదయాన్ని గుర్తించలేరు. వీళ్లు బైబులుకి అపార్గాలు కల్పించి స్వీయ నాశం తెచ్చుకొంటారు - 2 పేత్రు 3, 16. వ్రాత పూర్వకమైన చట్టం చావుకి దారితీస్తుందనీ, ఆత్మ జీవాన్ని దయచేస్తుందనీ చెప్పాడు పౌలు -2కొ 3,6. దివ్యగ్రంథాన్ని లోతుగా అర్థం చేసికోక వెర్రిమొర్రిగా అర్థంచేసికొంటే అది మనకు వ్రాత పూర్వకమైన చట్టం మాత్రమేఐ చావుని తెచ్చిపెడుతుంది. ఆ గ్రంథాన్ని లోతుగా అర్థంచేసికొని దానివలన మన హృదయాన్ని మార్చుకొంటే అది మనకు జీవాన్ని దయచేస్తుంది. ఎమ్మావు శిష్యులు ఈలా ప్రభువు వాక్కు ద్వారా జీవాన్ని పొందారు — లూకా 24, 32.

ఉపసంహారం

చాలామంది బైబులును గూర్చి వినగోరుతారుగాని బైబులును మాత్రం చదవరు. ఇది చాల చెడ్డపద్ధతి. బైబులును గూర్చి వింటేకాదు, స్వయంగా చదువుకొని ప్రార్ధనం చేసికొంటే బైబులు వస్తుంది. ఈత వేయడం ద్వారా ఈతా, పాట పాడడం ద్వారా పాటా, నాట్యం చేయడం ద్వారా నాట్యమూ, క్రీడను అభ్యాసం చేయడం ద్వారా క్రీడా వస్తాయి. కేవలం ఈ కార్యాలను గూర్చి ఉపన్యాసాలు వింటే ఇవి రావు. బైబులు కూడ ఇంతే. కనుక భక్తుడు స్వయంగా దివ్యగ్రంథ పారాయణానికి పూనుకోవాలి. రోజూ ఓ పావుగంట కాలమైనా గ్రంథం చదువుకోవాలి.

3. భక్తిమంతమైన బైబులు పఠనం

1 - బైబులు పఠనం

1. దివ్య గ్రంథాలు :

పౌలు శిష్యుడు తిమోతి చిన్నవాడుగా ఉన్నపుడే అమ్మమ్మ అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని దివ్యగ్రంథం చదివించేదట (2తిమొ. 1:5, 3:15). తరువాత చాల యేళ్ళ గడచాక, నీవు చిన్ననాడే అలవాటు చేసుకున్న బైబులు పఠనాన్ని అశ్రద్ధ చేయవద్దని పౌలు తిమొతిని హెచ్చరించాడు (1తిమొ. 4:13) ప్రాచీన క్రైస్తవులు దివ్య సత్రసాదంతో పాటు దివ్యగ్రంథ భాగాలనుగూడ మెడలో తాయతులుగా కట్టుకునేవాళ్ళు వాటికన్ కౌన్సిల్వంటి పెద్దపెద్ద సమావేశాల్లో యీ గ్రంథాన్ని సభామధ్యంలో వుంచేవాళ్ళు సభకు ఈ గ్రంథమే అధ్యక్షస్థానం వహించేది. అగస్టిన్, ఫ్రాన్సిస్ వంటి గొప్ప పునీతులు యీ గ్రంథం చదివి పరివర్తనం చెందారు,