పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



నిరాశ వలన దేవుణ్ణి నమ్మలేనివాళ్ళకి
స్నేహితుల యండదండ లెంతైనా యావశ్యకంకాదా?"

అని నేస్తులను నిందించాడు- 6,12-14 “నా దోషమేమిటో మీరే నిరూపించండ"ని మిత్రులను సవాలు చేసాడు - 6,24.

పాపం అతనికి పండుకొంటే నిద్రపట్టేది కాదు
"నేను ఏలాంటి ఆశలూ లేకుండానే నెలలు గడిపాను
విచారంతో రాత్రులు వెళ్ళబుచ్చాను
నేను పండుకొన్నపుడు
పగలెప్పడు వస్తుందా అనుకొంటాను
పడకనుండి ఎప్పడు లేస్తానా అనుకొంటాను
వేకువదాక నిద్రపట్టక బాధపడతాను
నా యొడలినిండ పండ్లలేచి పరుగులు పడ్డాయి
నా చర్మం పగిలి రసి కారుతూంది
ప్రభూ! నా జీవితం శ్వాసవలె క్షణికమైంది
నాకిక యెట్టి యానందాలూ లేవు
పూర్వం నన్నెరిగిన వారికి నేనిక కన్పింపను
నీవు నన్ను చూడగోరినా నేనిక దొరకను”

అని శోకించాడు -7, 3-8. దేవుడు తనపట్ల నిరంకుశంగా ప్రవర్తించి నిర్దోషియైన తన్ను నిష్కారణంగా శిక్షిస్తున్నాడని అపోహపడ్డాడు యోబు

"దోషిని నిర్దోషిని గూడ
అతడు సమంగానే నాశం చేస్తాడు
నిర్దోషి తలవని తలంపుగా నాశంకాగా
దేవుడు నవ్వి వూరకుంటాడు"

అని ఫిర్యాదు చేసాడు - 9, 22-23. ఇంకా, తాను బాలుడుగా వున్నపుడు తెలిసీ తెలియక చేసిన పాపాల కొరకు దేవుడు తన్ను క్రూరంగా దండిస్తున్నాడేమోనని కూడ శంకించాడు.

"నేను బాలుడ్డిగా వున్నపుడు చేసిన పాపాలకు
నీవు నామీద ఘనోరమైన నేరాలు మోపుతున్నావు
నీవు నా పాదాలను బండకొయ్యలో బిగించావు