పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



“సంతాపమే నా కాహారమైంది
నా నిటూర్పులకు అంతమేలేదు
నేను దేనికి వెరుస్తున్నానో,
దేన్నిగూర్చి భయపడుతున్నానో అదే జరిగింది
నాకు శాంతి సమాధానాలు లేవు
నా శ్రమల కంతం లేదు?
అని వాపోయాడు - 3, 24-26

.

ఇంకా తాను పుట్టిన దినాన్ని శపిస్తూ "నేను పుట్టిన దినం నశించుగాక ఒక మగబిడ్డ ఆమె కడుపున పడ్డాడని మా యమ్మనుగూర్చి వార్త పట్టినరేయి నశించుగాక" అని అంగలార్చాడు3,1-3. కాని మల్లా కొంచెం పస్తాయించుకొని, తన తొందరపాటుకి పశ్చాత్తాపపడుతూ

“నా బాధలను తూయగలమేని,
నా వ్యధలను తక్కెడలోబెట్టి తూయజాలుదుమేని
అవి సముద్రపు టిసుకదిబ్బలకంటె
ఎక్కువ బరువుగా వుంటాయి
కనుక నేను తాలిమిమాలి మాటలాడాను
ప్రభువు బాణాలు నా దేహంలో గుచ్చుకొన్నాయి
నా హృదయం వాటి విషంతో నిండిపోయింది
ప్రభువు పంపే యాతనలు
నా మీదికి బారులుతీరి వచ్చాయి”

అని వాపోయాడు - 6, 1-3. ఇక్కడ యుద్ధంలో విరోధి బాణాలు రువ్వినట్లుగా ప్రభువు యోబుమీద అమ్ములు విసరాడని భావం, అతడు స్నేహితులను జూచి మీరు నన్ను ఓదార్చడానికి మారుగా నా మీద తప్పపడుతున్నారని నిష్ణురాలు పలికాడు

'నేనేమి శిలనా?
నాది యిత్తడి దేహమా యేమి?
ఇక నాలో ఏమిశక్తి మిగిలియున్నది?
ఇక నాకు దిక్కేమి కలదు?