పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. మొదటి సంభాషణం

తెలియక చేసిన పాపాల ఫలితంగా యోబుకి శిక్ష

యోబు తాను తెలియక చేసిన పాపాలకు ఫలితంగా శిక్ష ననుభవిస్తున్నాడు కాబోలు అనుకొన్నారు స్నేహితులు. మనం బుద్ధిపూర్వకంగా కాకపోయినా బలహీనతవల్లా అజ్ఞానంవల్లా దేవుని ఆజ్ఞలుమీరి పాపం కట్టుకొంటూంటాం. యోబుకూడ ఈలాగే చేసివుండాలి. కనుక అతడు పశ్చాత్తాపపడితే దేవుడు అతని తప్పిదాలను మన్నిస్తాడు అని హితోపదేశం చేసారు మిత్రులు. విశేషంగా టేమాను నగరవాసియైన యెలీఫాను యోబుకి హితబోధ చేస్తూ

“ఏ నరుడైన దేవుని యెదుట నిర్దోషిగా కన్పిస్తాడా?
ఎవడైన సృష్టికర్తముందట పవిత్రుడుగా చూపడతాడా?
దేవుడు స్వర్గంలోని తన సేవకులనే నమ్మడు
అతడు దేవదూతల గణంలోనే తప్పలు పడతాడు
ఆలాంటివాడు మట్టితో జేయబడిన మర్త్యుని,
దుమ్మునుండి తయారైన నరుని,
చిమ్మటవలె చితికిపోయే మానవుని నమ్ముతాడా?

అని ప్రశ్నించాడు- 4, 17-19. కనుక యోబుకూడ తప్పచేయడంలో ఆశ్చర్యంలేదు. ఐనా అతడు పశ్చాత్తాపపడితే చాలు దేవుడతన్ని మన్నిస్తాడు

“దేవుడు శిక్షించి చక్కదిద్దే నరుడు ధన్యుడు
కనుక నీవు ప్రభువు శిక్షకు కోపించవద్దు
దేవుడు గాయపరచేవాడు, కట్టుకట్టేవాడు కూడ
దెబ్బలు కొట్టేవాడు, చికిత్సచేసేవాడు కూడ"

అని చెప్పాడు - 5, 18-19. అలాంటి దేవుణ్ణి శరణు వేడమన్నాడు. ఇంకా యెలీఫాసు

“వ్యధలు మట్టిలోనుండి పుట్టుకరావు
తిప్పలు నేలలోనుండి మొలకెత్తవ
పక్షి ఆకాశానికి ఎగిరినంత సులువుగా
నరుడు తన తిప్పలు తానే కొనితెచ్చుకొంటాడు"

అని పల్మాడు - 5,6–7. కాని యోబుకి ఈ యాలోచన నచ్చలేదు. తాను నిర్దోషిననే అతని నమ్మకం. అతడు తన బాధలను ప్రస్తావిస్తూ