పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా మార్గాలనూ అడుగుజాడలనూ గుర్తుపట్టావు
నేను చివికిపోయిన కొయ్యలాగ,
చిమ్మటలు కొట్టిన బట్టలాగ తుత్తినియలయ్యాను"

అని వాపోయాడు - 13, 26-28. దేవుడు తాను తప్పుచేసినపుడు తన్ను పట్టుకొని దండించడానికి కాచుకొని వున్నాడనీ, అతడు వట్టి మోసగాడనీ ఫిర్యాదు చేసాడు

"నీవే నన్ను సృజించి నాకీ రూపాన్ని దయచేసావు
కాని నీవే నన్నిపుడు నాశం చేయబూనావు
నీవు నన్ను మట్టినుండి మలిచావు
తిరుగా నన్ను మట్టిపాలు చేస్తావా?
పాలనుండి వెన్నయేర్పడినట్లుగా
నీవు నన్ను మాతృగర్భాన రూపొందించావు
చర్మాన్ని నాకు వస్త్రంవలె తొడిగావు
ఎముకలతో నరాలతో నన్ను బట్టనువలె నేసావు
అటుపిమ్మట నాకు వూపిరిపోసి
అనురాగంతో నన్ను పరామర్శించావు
కాని యింత చేసినపుడు కూడ నీవు మోసంతో వర్తించి
నాకు హానిచేయడానికి తరుణం కొరకు వేచివున్నావని
ఇప్పడు నేను గుర్తించాను
నేను పాపం చేసినపుడు నాకు క్షమాభిక్షను
నిరాకరించవచ్చునని నీవు కనిపెట్టుకొని వున్నావు"

అని దేవునిమీద నేరం మోపాడు - 10, 8-14. కడన దేవునిమీద తిరగబడుతూ

"నేనేమి తప్పచేసాను? ఏమి పాపాలు కట్టుకొన్నాను?
ఏ యపరాధాలు సల్పాను? ఏ యాజ్ఞలు మీరాను?
నీవిపుడు మొగం చాటుచేసికోనేల?
నన్ను నీ శత్రువునిగా భావింపనేల?
గాలికెగిరిపోయే ఈ యాకునా నీవు భయపెట్టేది?
ఎండిపోయిన ఈ తాలునా నీవు వెన్నాడేది?

అని దేవుణ్ణి దబాయించాడు- 13, 23-25.