పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహాయంతో యిస్రాయేలు దేవుణ్ణి అణచివేస్తాడని బాలాకు నమ్మకం. కాని ఆ ప్రవక్త యావే భక్తుడే. ఆ సంగతి బాలాకునకు తెలియదు. బాలాకు దూతలు సొమ్ముతో రాగా బిలాము వారి డబ్బు తీసికోలేదు. ముందుగా యావేను సంప్రతించి నేనీజనంతో పోవచ్చా అని అడిగాడు. ప్రభువు నేను దీవించిన వారిని నీవు శపించకూడదు అన్నాడు. కనుక ప్రవక్త రాజు దగ్గరికి పోవడానికి నిరాకరించాడు. అతడు యావే అనుగ్రహంతో ప్రవచనం చెప్పేవాడు.

రాజు రెండవసారి కూడ దూతలను పంపాడు. ఈసారి యావే నీవు వారివెంట వెళ్ళవచ్చు. కాని నీవు అక్కడ నేను చెప్పిన పనిని మాత్రమే చేయాలి సుమా అని చెప్పాడు. ప్రవక్త గాడిదనెక్కి బాలాకు దగ్గరకు బయలుదేరాడు.

2. గాడిద కథ

ఈ గాడిద కథ గమ్మత్తుగా వుంటుంది. ఇది వో జానపద కథ. బైబులు రచయితలు దీన్ని బిలాము కథలో చేర్చారు. బిలాము రాజు దగ్గరికి పోవడం ప్రభువు చిత్తంకాదు అన్నట్లుగా ఈ గాడిద కథ ప్రారంభమౌతుంది. దేవదూత కత్తి దూసి గాడిదకు అడ్డంగా నిలబడ్డాడు. అది భయపడి ప్రక్కకు తొలగి పొలంలోకి వెళ్ళింది. ప్రవక్త దాన్ని బాది మళ్ళా దారిలోకి తీసికొని వచ్చాడు. అతడు మాత్రం దేవదూతను చూడలేదు.

రెండవసారి గాడిద రెండు గోడలకు నడుమగా సన్నని దారిగుండ పోతూంది. మల్లా దేవదూత గాడిదకు అడ్డమొచ్చాడు. అది గోడకు ఆనుకొని పోగా బిలామకాలు రాచుకొని పోయింది. అతడు దాన్ని చావమోదాడు.

మూడవసారి గాడిద తప్పకోవడానికే వీల్లేని ఇరుకు త్రోవలో పోతూంది. మళ్లా దేవదూత గాడిదకు అడ్డమొచ్చాడు. అది చేసేదిలేక నేలమీద చతికిలబడింది. అప్పడు గాడిద ఓ మనిషిలాగ ప్రవక్తతో మాటలాడింది. అతడు కన్నులు తెరచి తన యెదుటనున్న దేవదూతను చూచాడు.

ఈ కథలో చాలా హాస్య సంఘటనలు ఉన్నాయి. పిచ్చి జంతువైన గాడిద దేవదూతను చూచింది. దర్శనాలు చూచే ప్రవక్త దేవదూతను చూడలేకపోయాడు. ఇంకా, లాము గాడిదతో నా చేతిలో కత్తివుంటే నిన్ను నరికివేసేవాణ్ణి అన్నాడు. నిజంగానే దూత కత్తిదూసి బిలామును నరకబోయాడు. ఐనా ఆ సంఘటన బిలాముకి తెలియనే యదు. ప్రవక్త దేవుని ఆజ్ఞను మీరరాదనీ అతడు పలికించిన పలుకునే పలకాలనీ కథ భావం. ఇది బైబుల్లోని హాస్యభరిత కథల్లో వొకటి. 112