పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



3. నాలు ప్రవచనాలు

బిలాము నాలు ప్రవచనాలు చెప్పాడు. ఒక్కొక్క దానిలోను యిప్రాయేలును శపించడానికి మారుగా దీవించాడు. అది దైవ ప్రబోధం. ఒక్కో ప్రవచనంలోను మూడంశాలు వుంటాయి. 1. అతడు ఓ ప్రత్యేక స్థలంలో నిల్చుండి ప్రవచనాలు చెప్తాడు. 2. ఏడు పీఠాలమీద ఎద్దులనూ పొట్టేళ్ళనూ బలియిస్తాడు. 3. ఆ పిమ్మట ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రభువు సందేశాన్ని వింటాడు. ఆ సందేశాన్ని రాజుకి ఎరిగిస్తాడు. అతడు దేవుడు పల్మించిన పలుకులు మాత్రమే పల్ముతాడు - 38.

మొదటి ప్రవచనం ఇది. దేవుడు శపింపనివారిని బిలాము శపింపడు – 23,8, ప్రభువు యిస్రాయేలును దీవించాడు. కనుకనే వాళ్ళు భూరేణువుల్లాగ అసంఖ్యాకంగా విస్తరిల్లారు. అలాంటి వాళ్ళను ప్రవక్త శపింపడు. ప్రాచీన కాలంలో సంతానం, జనసంఖ్య గొప్ప భాగ్యాలు కదా! ప్రవక్త దీవెన రాజుకి నచ్చలేదు. రెండవ ప్రవచనం ఇది. దేవుడు యిస్రాయేలుకు మేలు చేస్తానని వాగ్లానాలు చేసాడు. ఆ వాగ్దానాలు నెరవేరితీరుతాయి. అతడు నరుల్లాగా ఆడితప్పేవాడు కాదు. తన ప్రమాణాలను నిలబెట్టుకొనేవాడు - 23,19. ఆలాంటి వాళ్ళమీద ప్రవక్త శాపాలు పనిచేయవు. యిప్రాయేలీయులు సింహంలాగ పరాక్రమవంతులు. వాళ్లు భవిష్యత్తులో శత్రువులనూ, మోవాబీయులను గూడ ఓడించగలరు. సహజంగానే ఈ దీవెనకూడ రాజుకి నచ్చలేదు. కాని బిలాము యావే పల్ములే పల్కుతాడు-26.

మూడవ ప్రవచనం ఇది. యిప్రాయేలుకి నాయకుడు లభిస్తాడు. వాళ్ళ భూమిని పొంది రాజ్యాన్ని స్థాపిస్తారు. శత్రువులను జయిస్తారు-247. వాళ్లు తోటల్లాగఎదుగుతారు ఈ ప్రవచనం కూడ రాజుకి నచ్చలేదు.

నాల్గవ ప్రవచనం ఇది. యిప్రాయేలు నుండి ఒక చుక్క రాజదండం పుడతాయి. అనగా వారినుండి ఒక రాజు ఉద్భవిస్తాడు - 24, 17. ఈ రాజు దావీదు, మెస్సీయా కూడ ఇంకా యిస్రాయేలు శత్రురాజ్యాలైన మోవాబు, ఎదోము మొదలైన వాటిని జయిస్తారు.

ఈ ప్రవచనాలన్నీ కూడ యిప్రాయేలు వృద్ధిలోకి వస్తారని చెప్తాయి. వాళ్ళు సొంత రాజ్యాన్ని స్థాపించి శత్రురాజ్యాలను జయిస్తారని చెప్తాయి. ఆ ప్రజలు కనాను దేశంలో ప్రవేశించబోయేపుడు బిలాము ఈలాంటి వాక్యాలు పల్కి వారికి ప్రేరేపణం పట్టించాడు. అతడు భావికాలంలో వారికి సిద్ధించబోయే విజయాలను సూచించాడు.

బిలాము దైవప్రబోధం ప్రకారం జీవించినవాడు. దేవుడు చెప్పమన్న సందేశాన్ని మాత్రమే చెప్పేవాడు. అతనికి బాలాకు ఇచ్చే బహుమతులు కాదు, దేవుని చిత్తాన్ని 113