పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



7. కంచు సర్పం 21, 4-9

ప్రజలు హోరు పర్వతం దాటి రెల్లు సముద్రం ప్రక్కగా ప్రయాణం చేస్తున్నారు. ఈ యెడారిలో వారికి అన్నపానీయాలు దొరకలేదు. వెంటనే వాళ్ళమోషేమీదా దేవునిమీదా తిరగబడ్డారు. మనం ఈజిప్టులో వున్నపుడే సౌఖ్యంగా ఉంది అన్నారు. దేవుడు వారి తిరుగుబాటుకు శిక్షగా విషసర్పాలను పంపాడు. అవి కరవగా చాలమంది చనిపోయారు. ప్రజలకు బుద్ధివచ్చి దేవునికి విన్నపం చేయమని మోషేను బతిమాలారు. అతడు దేవునికి విజ్ఞాపనం చేసాడు. ప్రభువు అగ్న కంచు పాముని చేసి గడె పై కెత్తి ప్రజలకు చూపించాడు. దానివైపు చూచిన వాళ్ళంతా విషం విరిగి బ్రతికిపోయారు.

ఇక్కడ కంచు పాము ప్రజలను రక్షించలేదు. అదివొట్టి బొమ్మ చిహ్నం. ప్రజలు దేవుడు ఆజ్ఞాపించినట్లు కంచు పామువైపు చూచారు. అవిధేయులు విధేయులయ్యారు. కనుక ప్రజల విధేయతావిశ్వాసాలు వారిని రక్షించాయి.

నూత్న వేదంలో ఈ కంచుపాము క్రీస్తుకే చిహ్నంగా ఉంటుంది. దాన్ని గడెమీది కెత్తినట్లే క్రీస్తుని సిలువమీది కెత్తారు. అలా యెత్తబడిన క్రీస్తువైపుచూచి, అతన్ని విశ్వసించి, మనం రక్షణ పొందుతాం. ఇక్కడ క్రీస్తుని సర్పంతో పోల్చలేదు. ఉపమానం కేవలం ఎత్తబడ్డంతోనే - యోహా 3,14

8. బిలాము కధ 22-24

1. బిలాము రాకడ

యిస్రాయేలీయులు మోవాబు దేశంలోనికి వచ్చి యోర్గాను సమీపాన విడిది చేసారు. వారి సంఖ్యను చూచి మోవాబీయులు భయపడ్డారు. పూర్వం యిస్రాయేలు సంఖ్యను చూచి ఫరో చక్రవర్తి ఈలాగే భయపడ్డాడు.

మోవాబు రాజు బాలాకు. అతడు ఎద్దు గడ్డిమేసినట్లుగా యిప్రాయేలు ప్రజలు తన దేశాన్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాడు-4 ఆ రోజుల్లో మెసపొటామియా మండలంలోని పేతోరున బిలాము అనే ప్రవక్త ఉండేవాడు. అతడు సమూవేలు యేలీయాల్లాగా దేవుని పలుకులు విన్పించే ప్రవక్త, అతడు ఏమి చెప్పితే అది జరిగి తీరుతుంది. అతని దీవెనలకూ శాపాలకూ తిరుగులేదు. - 22,6. కనుక బాలాకు ఆ ప్రవక్తను పిల్చుకొని రమ్మని బిలాము నొద్దకు దూతలను పంపాడు. వాళ్ళు డబ్బు తీసికొని ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఈ ప్రవక్త యిప్రాయేలును శపిస్తే వాళ్ళ బలం పోతుందనీ,అప్పడు తాను వాళ్ళను యింపవచ్చుననీ బాలాకు పన్నాగము. బిలాము తన దేవుని 111