పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవించాలి. అసలు వానలు కురిపించి నరులకు పంటలు పండించిపెట్టేది దైవవాకేగదా? అని నుడివాడు – 16,26.

2. దేవునికి పరీక్ష

 : యిప్రాయేలీయులకు మస్సావద్ద నీళ్ళు దొరకలేదు. వాళ్లదేవుడు మనలను విడనాడాడు, లేకపోతే ఈ యగచాట్లు ఎందుకు వస్తాయి అని వాపోయారు. అతడు మనతో వున్నాడో లేదో పరీక్షించి చూడాలి అనుకొన్నారు. మోషేమీద తిరగబడ్డారు. అప్పడు ప్రభువు వాళ్ళకు మస్సారాతిచట్టనుండి నీళ్ళు పారించాడు. ఇది రెండవ శోధన - 17,7.

పిశాచం క్రీస్తుని దేవాలయ గోపురంమీద కూర్చోబెట్టి అక్కడినుండి క్రిందికి దూకమంది. నీతండ్రి నిన్ను ఆదుకోవడానికి వస్తాడో లేదో పరీక్షించి చూడమంది - మత్త 4,6. క్రీస్తుకి పిశాచశోధనం అర్థమయింది. అతడు నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షకు గురిచేయవద్దు అని జవాబు చెప్పాడు - ద్వితీ 6, 16.

3. విగ్రహారాధనం

 : యిస్రాయేలీయులకు నిత్యశోధనం బాలు ఆరాధనం. ప్రభువు అప్పడే ప్రజలతో నిబంధనం చేసికొని ముగించాడు. మోషే కొండమీదికి ఎక్కిపోయి కొంచెం జాగుచేసాడు. అతడు దిగివచ్చే లోపులోనే వాళ్ళ బాలు చిహ్నమైన కోడెను ఆరాధించడం మొదలెట్టారు — నిర్గమ 32,4. యిప్రాయేలీయుల చరిత్ర పొడుగునా ఈ విగ్రహారాధన అనేది వాళ్ళ ప్రధాన పాపం. ఇది మూడవ శోధనం.

పిశాచం ఎడారిలో క్రీస్తుకికూడ ఇదే శోధనం కలిగించింది. అతన్ని ఎత్తయిన కొండమీదికి తీసుకవెళ్ళి ప్రపంచంలోని రాజ్యాలన్నీ చూపించింది. నీవు చాగిలపడి నన్ను ఆరాధించావంటే ఈ రాజ్యాలన్నీ నీకిచ్చివేస్తాను అని మభ్యపెట్టింది. కాని క్రీస్తు “నీ దేవుడైన ప్రభువుని ఆరాధించి అతన్ని మాత్రమే కొలువు" అని జవాబు చెప్పాడు - ద్వితీ 6, 13. ఈలా మూడు శోధనల్లోను పిశాచమే ఓడిపోయింది.

యిస్రాయేలు శోధనలకూ క్రీస్తు శోధనలకూ సంబంధం వుందని చెప్పాం. యిస్రాయేలు దేవుని తొలికుమారుడు. అతడు శోధనలకు లొంగిపోయాడు. క్రీస్తు దేవుని మలికుమారుడు. ఇతడు శోధనలను గెలిచాడు. తన పితరుల పాపాలకు పరిహారం చేసాడు. క్రీస్తుద్వారా దేవుని కుమారులమయ్యే మనం కూడ శోధనలకు లొంగకూడదు. శోధనలు వచ్చినపుడు క్రీస్తు విజయం మనమీద పనిచేస్తుంది. అతడు దయ్యాన్ని గెలిచిన వాడు. అతని గెలుప మన గెలుపు. ఆ గెలుపుద్వారా మనంకూడ పిశాచంమీద విజయాన్ని సాధిస్తాం. శోధనలు వచ్చినపుడుమనం ఆ ప్రభువు సహాయం అడుగుకోవాలి. వాటినుండి మనలను గట్టెక్కించేవాడు క్రీస్తే - హెబ్రే 4, 15-16.