పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. సాన్నిధ్యం

పూర్వవేదంలో ప్రభువు యిస్రాయేలీయులకు దగ్గరిచుట్టం అయ్యాడు. వాళ్లనడుమ వసించేవాడు. కనుకనే ఆ ప్రజలు అతన్ని ఇమ్మానువేలు అని పిల్చారు. నిర్గమనకాలంలో ప్రభువు విశేషంగా మందసంలో, గుడారంలో, మేఘస్తంభంలో వసించాడు. వీటిల్లో నెలకొనివుండి యిప్రాయేలును కాపాడాడు. నూత్నవేదంలో క్రీస్తు సాన్నిధ్యం మనలను రక్షిస్తుంది. ఈలా ఈ సాన్నిధ్యం బైబుల్లో ఓ పెద్ద అంశం. ప్రస్తుతాధ్యాయంలో ఈ భావాన్ని పరిశీలించిచూద్దాం.

1. మందసం

1. మందసరూపం :

మందసం అంటే ఏమిటి? అది కొయ్యతో చేయబడిన పెట్టె. దాని చుట్టు బంగారు రేకు పొదిగారు. దేవుడు పది యాజ్ఞలు వ్రాసి యిచ్చిన రాతిపలకలు దానిలో పెట్టారు. పెట్టెమీద కరుణాఫలకం అనే బంగారు పలక వుంటుంది. దాని మీద ఒకదానికొకటి అభిముఖంగావుండే రెండు దేవదూతల బొమ్మలుండేవి. ఆ రెండు బొమ్మలకు మధ్య కొంచెం ఖాళీ స్థలం వుండేది. దైవసాన్నిధ్యం వుండేది ఈ స్థలంలోనే - నిర్గ 25, 10-22. యూదులు ఈ పెట్టెను దేవుని సింహాసనంగా భావించారు - 1 సమూ 44. అది ఆ దేవుని పాదపీఠం అన్నారు - 1దిన 25,22. ఎడారికాలంలో ఈ మందసం దైవసాన్నిధ్యానికి మనికిపట్టు.

2. దైవ సందేశం :

పదియాజ్ఞల పలకలు ఈ పెట్టెలో వున్నాయిగదా! కనుక ఇది దైవాజ్ఞలకీ దైవ సందేశానికీ నిలయమైంది. పెట్టెమీది రెండు బొమ్మల నడిమి ఖాళీస్థలంలోనుండి దేవుడు మోషేతో మాటలాడేవాడు - నిర్గ 25,22. తర్వాత ఈ పెట్టెదగ్గరే చాలామంది భక్తులు దైవ సందేశం విన్నారు. బాలుడైన సమూవేలు ఇక్కడే దేవుని పిలుపు ఆలించాడు - 1 సమూ 3, 1-5. ఈ పెట్టె దగ్గరే చాలమంది భక్తులు దేవుని ప్రార్ధించారు. సమూవేలు తల్లి అన్నాయిక్కడే బిడ్డకోసం ప్రార్థన చేసింది. - 1 సమూ 1,9-11. ఇక్కడే మోషే బంగారుదూడ నారాధించిన యిప్రాయేలును నాశం చేయవద్దని ప్రభువునకు విజ్ఞాపనం చేసాడు - సంఖ్యా 14,13-19.

3. ప్రజలను నడిపించడం :

ఎడారికాలంలో మందసం ముందు వెళూండగా ప్రజలు దాని వెనుక నడుస్తుండేవాళ్లు. అది విశ్రాంతి స్థలం చూపించినపుడు వాళ్లు విడిది చేసేవాళ్లు - సంఖ్యా