పుట:Bhoojaraajiiyamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకలోముని కథ

123


గమలఁగఁ జేసిన బ్రహ్మకు
రమణీ! [1]ని న్నిట్లు సేయ రాకుండెడునే!'

85


వ.

అని యుపలాలించి తనతోడనె కూడ మంగళస్నానంబు సేయించి విమలాంబ
రాభరణశోభితం గావించి గాఢాలింగనంబున నయ్యంగన నపగతక్లేశం జేసి.

86


చ.

సరకునిఁ జంపి వానిసదనంబున నున్న నృపాలకన్యలం
దిరముగఁ దెచ్చు కృష్ణునిగతిన్ శిబిలోముడు దక్సతీతతిన్
వరుస [2]వెలర్ప ముంద రజవక్షునికూఁతురు నిర్గమించినం
దరమునఁ గాచియుండిన ప్రధానిసుతుండు మనోగతంబునన్.

87


మ.

ఒకభంగిన్ నృపపుత్రుఁ గన్మొఱఁగి యే నుగ్రాటవుల్ చొచ్చి యీ
సుకుమారిం గొనిపోవఁగా దనుజుఁ డచ్చో నన్నుఁ బోఁదోలి యు
త్సుకరీతిం గొనిపోయె దీనిఁ, దుది మత్పూర్వార్జితోదాత్తస
త్సుకృతం బీక్రియఁ దెచ్చి యిచ్చెఁ దరుణీచూడామణిం గ్రమ్మఱన్.

88


క.

అనుచుఁ దదీయద్వారం
బునఁ బెనుగుండొకటి ద్రోచి పూర్ణేందుముఖిం
గొనిపోయె గుంభి యపు డ
వ్వనితారత్నంబు శోకవహ్ని నెరియుచున్.

89


ఉ.

ఈ మనుజాధముండు నను నెయ్యెడ కీడ్చునొ, వీని గెల్వ నా
కేమి మతంబు గల్గు నని యిచ్చఁ దలంచి యళీకహాసముల్
మోమునఁ దోఁప నిట్లనియె 'ముద్దియ చేకుఱె నీదుకోర్కి ర
మ్మా! మన మెట్టులున్నఁ బెఱమర్త్యు లేఱుంగరు చన్నసన్నయున్.

90


ఉ.

కావున నీవు మజ్జనకుఁ గాంచి స్వయంవర లద్ధి యయ్యె నా
కీవనజాక్షి, యంచు జనులెల్ల నెఱుంగఁగ నన్నుఁ జూపి యా
భూవిభు మన్నన ల్గనుట బుద్ధియు [3]మ్రుచ్చునుబోలె నొక్కెడన్
బోవుట మేలొ, మత్పురికిఁ బోదము రమ్ము వికార మేటికిన్.

91


వ.

అని వెడ్డు పెట్టిన నతండు బేల్పడి యట్లు చేసె, నయ్యజవక్షుండు మహాహర్ష
చక్షుం డగుచు వానికి నున్నతాసనంబు పెట్టించి సభాసదులం గలయ నవలో
కించి యి ట్లనియె.

92
  1. ని న్నెట్లు సేయ
  2. వెలర్పె
  3. మ్రుచ్చులువోలె