పుట:Bharatiyanagarik018597mbp.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్రక సామగ్రి భారతదేశచరిత్రమున కొక నూతనోత్తేజమును, శక్తిని గల్గించుచున్నది. దానినుండి ప్రాచీన భారతీయు లాశియా యూరోపు ఖండముల లోని విశేష భాగములపై నాధ్యాత్మిక దిగ్విజయ మొనర్చిరనియు, నేటి యింగ్లండు దేశమువలెనే భారతదేశము గూడ నొకప్పుడొక సువిశాల సామ్రాజ్యమున కధినేతయై, నాటి ప్రపంచమున కంతటికిని గూడ నాదర్శ భూమియై యొప్పుచుండె ననియు దెలియనగు చున్నది. తమదేశములను, తమ కుటుంబములను, విడిచి సుదూరదేశములకేగి యచటి కష్టనిష్టురముల కోర్చి యేకదీక్షతో క్రైస్తవమతప్రచార మొనర్చు పాదిరీలవలెనే యొకప్పుడు భారతీయులు వర్ణ వయో భేదములు లేక, సముద్రయానము నందలి ప్రమాదములను లెక్కచేయక, కేవలమును విశ్వమానవ కళ్యాణమునే కాంక్షించి, సుదూర దేశములకేగి భారతీయ విజ్ఞానమును వెదజల్లిరి. అంతవరకు నజ్ఞానాంధకారమున మునిగి యుండి యాథ్యాత్మిక ప్రవృత్తిలేక ననాగరికులుగ నుండిన జాతులవా రెందరో నాటి భారతీయ పండితుల యొక్కయు, బౌద్ధభిక్షువుల యొక్కయు, కవిగాయక శిల్ప్యాధికళారాధకుల యొక్కయు, స్వార్దరహితమగు సేవచే ప్రబుద్దులై స్వదేశీయసామగ్రిని భారత దేశాదర్శములను సమ్మేళనముచేసి విలక్షణమగు నాగరికతను నిర్మించుకొనిరి. అంతియగాక సాహస వంతులును, స్వాతంత్ర్యాభిలాషులునగు భారతవీరులెందరో మత రాజకీయాదివిప్లవము లొదవినప్పుడెల్ల మాతృదేశమును వీడి జావా, సుమత్రా, ఇండోచైనా, బర్మామున్నగుదూర దేశములకేగి, స్వభాహుబలముచే నచటివారిని జయించి, చక్కనిరాజ్యములను స్థాపించి, వానియందు తమతమ మాతృదేశములందలి నాగరికతను నెలకొల్పి పెంపొందించిరి. ప్రాచీన గ్రీసుదేశమునుండి యెందరో వలసపోయి, యీవిధముననే పెక్కు చిన్నచిన్న రాజ్యములను నెలకొల్పి గ్రీసుదేశనాగరికతను విస్తరింపజేసిరి. ఇటీవలికాలమున ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగుదేశములనుండియు ననేకు లపుడే నూతనముగ గనుగొనబడిన అమెరికా ఖండమున వలసరాష్ట్రములను నిర్మించిరి. కాని గ్రీసు