పుట:Bharatiyanagarik018597mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

1. ఆదర్శములు.

అతి ప్రాచీనకాలమునుండియు భారతదేశము నేటివలెనే యితర జాతులతోడను, దేశములతోడను, సంపర్కమేమియు లేక నేకాంత జీవితమును గడుపుచుండెనను నభిప్రాయము మన దేశీయులలో బలముగ నాటుకొనియున్నది. ఉత్తరమున హిమాలయములు నితరదిశల సముద్రము నీదేశమును బాహ్యసంపర్కమునుండి మూసివేయ, ప్రాచీన భారతీయులు వర్ణవిభేదములను గల్పించుకొని, పూర్వాచార పరాయణులై, కూపస్థ మండూకములవలె గాలక్షేపము చేయుచుండిరను నభిప్రాయము పూర్వచరిత్ర పఠనమువలన గలుగుచున్నది. కాని యిటీవల పరిశోధన లీయభిప్రాయము వాస్తవము కాదనియు, సత్యదూరమనియు నిరూపించుచున్నవి. ప్రాచీనార్యులకును నేటిక్రైస్తవ జాతులకును నడుమ నీదేశముపై దండెత్తివచ్చిన ప్రతి జాతికిని తమ స్వాతంత్ర్యమును గోల్పోవుచు, వారికి జోహారొనర్చుచు, కొంచె మవకాశము దొరికినపుడు కొలదికాలము తలయెత్తుచు, మొత్తముమీద భారతీయులు శతాబ్దములకాల మస్వతంత్ర జీవితమున కలవడిరను పూర్వాభిప్రాయము సరియైనదికాదు. అటులే భారతీయ నాగరికత భారతదేశపు సరిహద్దులను దాటలేదనియు, నేటి ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగు పాశ్చాత్యదేశీయులవలె భారతీయుల ప్రతిభ తమ దేశము నెన్నడును దాటిపోలేదనియు, నెంచుటయు ప్రమాదకరమే. ఇటీవల ఆశియాఖండమునందలి వివిధ భాగములలో గనుగొనబడిన చారి